తిరుత్తణి: వారాంతపు సెలవు దినంతో పాటు శుభ ముహూర్తదినం సందర్భంగా ఆదివారం తిరుత్తణి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. తిరుత్తణిలోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ఆదివారం సెలవు దినంతో పాటు శుభముహూర్త దినం సందర్భంగా ఆలయ అధికారుల అనుమతితో ఆలయ మండపాల్లో 15 వివాహాలు జరిగాయి. దీంతో పాటు సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తిరుత్తణి కొండ ఆలయంకు పోటెత్తారు. దీంతోపాటు పట్టణ వ్యాప్తంగా ప్రయివేటు కల్యాణ మండపాల్లో 50కు పైబడిన వివాహాలు జరిగాయి. వివాహాలు ద్వారా ఏకమైన నవ దంపతులతో పాటు వారి కుటుంబీకులు, బందువులు స్వామి దర్శనంకు కొండ ఆలయంకు పోటెత్తారు. సర్వ దర్శన క్యూలైన్‌లతో పాటు రూ. వంద ప్రత్యేక దర్శన మార్గాల్లో భక్తులు మూడు గంటల పాటు వేచివుండి స్వామిని దర్శించుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. రాత్రి ఉత్సవర్లు సుబ్రహ్మణ్యస్వామి స్వర్ణ రథంపై కొలువుదీరి ఆలయ మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.
తిరుత్తణి కొండ ఆలయంలో భక్తుల రద్దీ
అలంకరణలో ఉత్సవర్లు సుబ్రహ్మణ్యస్వామి


