ఉత్తర చైన్నెలో జీ స్క్వేర్‌ భారీ ప్రాజెక్ట్‌ | - | Sakshi
Sakshi News home page

ఉత్తర చైన్నెలో జీ స్క్వేర్‌ భారీ ప్రాజెక్ట్‌

Jun 8 2026 7:06 AM | Updated on Jun 8 2026 7:06 AM

సాక్షి, చైన్నె: జీ స్క్వేర్‌ గ్రూప్‌ ఉత్తర చైన్నె పరిధిలోని కరణోడై సరికొత్త ప్రీమియం రెసిడెన్షియల్‌ ప్లాట్ల ప్రాజెక్ట్‌ జీ స్క్వేర్‌ క్షేత్ర పేరిట ప్రారంభించింది. చైన్నె పెరిఫెరల్‌ రింగ్‌ రోడ్‌ అనుకుని, ఔటర్‌ రింగ్‌ రోడ్‌కు అత్యంత సమీపంలో వ్యూహాత్మక ప్రాంతంలో ఈ భారీ ఇంటిగ్రేటెడ్‌ ప్రాజెక్ట్‌ను లేఅవుట్‌ చేశారు.ఈ కారిడార్‌ పరిధిలో ప్రస్తుతం మార్కెట్‌ ధర చదరపు అడుగుకు రూ.4,000 నుండి రూ. 6,000 వరకు పలుకుతుండగా, జీ స్క్వేర్‌ సంస్థ మొదటి 50 బుకింగ్స్‌కు మాత్రమే వర్తించేలా చదరపు అడుగుకు కేవలంరూ1,890 ప్రత్యేక ప్రారంభ ధరను ప్రకటించింది. ఇది ప్రస్తుత మార్కెట్‌ ధర కంటే 50 శాతం తక్కువ కావడం గమనార్హం.అంతేకాకుండా, సంస్థ ఒక వినూత్నమైన సవాల్‌ను విసిరింది. తమ ప్రాజెక్ట్‌ నుండి 3 కిలోమీటర్ల పరిధిలో దీనికంటే తక్కువ ధర ఎక్కడైనా చూపిస్తే, కేవలం రూ. 1కే ప్లాట్‌ ఇస్తాం అని జీ స్క్వేర్‌ ప్రకటించింది. ఇది వినియోగదారులకు అత్యంత లాభదాయకమైన పెట్టుబడి అవకాశమని సంస్థ తెలిపింది.

పారిశ్రామిక హబ్‌లకు సమీపంలో..

శ్రీసిటీ, థర్వాయ్‌ కండిగై సిప్కాట్‌, గుమ్మిడిపూండి సిప్కాట్‌, మనల్లూరు, ఆరంబాక్కం సిప్కాట్‌, మిచెలిన్‌ టైర్స్‌ ప్లాంట్‌, రాబోయే మహీంద్రా వరల్డ్‌ సిటీ , శ్రీపెరంబుదూర్‌ పారిశ్రామిక ప్రాంతాలకు ఈ ప్రాజెక్ట్‌ చాలా దగ్గరగా ఉంది. కాట్టుపల్లి, అదానీ, ఎన్నోర్‌ పోర్టుల ద్వారా ఇక్కడ పారిశ్రామిక కార్యకలాపాలు వేగంగా విస్తరిస్తుండటం గమనార్హం. ఈ లాంచ్‌ సందర్భంగా జీ స్క్వేర్‌ గ్రూప్‌ వ్యవస్థాపకుడు, మేనేజింగ్‌ డైరెక్టర్‌ బాల రామాజయం మాట్లాడుతూ మౌలిక వసతుల విస్తరణ, పారిశ్రామిక వృద్ధి కారణంగా ఉత్తర చైన్నె రూపురేఖలు మారిపోతున్నాయన్నారు. ప్రస్తుతం కరణోడై ప్రాంతం ఈ అభివృద్ధికి కేంద్ర బిందువుగా నిలిచిందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement