కొరుక్కుపేట: లోక క్షేమాన్ని కాంక్షిస్తూ వెంకటేశ్వర భక్త సమాజం ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణ మహోత్సవం వైభవంగా సాగింది. చైన్నె పెరంబూరు పటేల్ రోడ్డులోని ఆనంద నిలయం వేదికగా వెంకటేశ్వర భక్త సమాజం ఆధ్వర్యంలో సీతారముల కల్యాణ వైభవంలో భాగంగా శనివారం రాత్రి వసంత కేళికై , పవలింపు, ఆంజనేయోత్సవం అనంతరం ఆదివారం ఉదయం 8గంటలకు అష్టపది, గీతాగోవిందం, ఉపచార పూజ, దీపారాధన, డోలోత్సవాన్ని వైష్ణవ ఆగమనం ప్రకారం వేదపండితులు ఘనంగా నిర్వహించారు. అనంతరం సీతారాముల తిరుకల్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆనంద భాగవతర్ నేతత్వంలోని కళాకారుల బృందం సంగీతంతో అందించిన కీర్తనలకు హైదరాబాదుకు చెందిన శ్రీకాంత్ అభినయం ప్రదర్శించి భక్తులను ఆకట్టుకున్నారు. ముఖ్యఅతిథి డి.జంబు, పురప్రముఖులను తమ్మినేని బాబు సత్కరించారు. సమాజం సెక్రటరీ వెంకటరామన్, కోశాధికారి కోదండరామయ్య, జాయింట్ సెక్రటరీ రవికుమార్, జాయింట్ కోశాధికారి వెంకట రమణుడు, ట్రస్టీ రామచంద్రన్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఆదివారం మధ్యాహ్నం కీల్పాక్‌లో ఉన్న మదర్ థెరిస్సా వృద్ధాశ్రమంలో ఎం.జయరామన్ స్మారకార్థం అన్నదానం చేశారు.


