జిల్లా వ్యాప్తంగా పోలీసుల తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

జిల్లా వ్యాప్తంగా పోలీసుల తనిఖీలు

Jun 8 2026 7:06 AM | Updated on Jun 8 2026 7:06 AM

జిల్లా వ్యాప్తంగా పోలీసుల తనిఖీలు నగరి డివిజన్‌లో కార్డన్‌ సెర్చ్‌ టీటీడీకి రూ.11.11 లక్షల విరాళం

చిత్తూరు అర్బన్‌: ముందస్తు నేరాల నియంత్రంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఆదివారం తనిఖీలు నిర్వహించారు. కార్వేటినగరంలో నాటు సారా తయారీకి ఉపయోగించే 450 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. చిత్తూరు వన్‌ టౌన్‌, టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలోని 20 మంది రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అలాగే జిల్లా వ్యాప్తంగా 70 మందికి డ్రగస్స్‌ కిట్ల ద్వారా పరీక్షలు నిర్వహించగా చిత్తూరు తాలూకా, యాదమరి ప్రాంతాల్లో ఐదుగురికి మాదకద్రవ్యాల పాజిటివ్‌ రిపోర్ట్‌ వచ్చింది. వీళ్లకు ప్రత్యేకించి కౌన్సెలింగ్‌ చర్యలు హెచ్చరించారు.

నగరి: నగరి డివిజన్‌ పరిధిలో ఆదివారం విస్తతంగా కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించినట్లు సీఐ మల్లికార్జున తెలిపారు. నగరితోపాటు నిండ్ర, విజయపురం, పాలసముద్రం, ఎస్‌ఆర్‌ పురం మండల్లాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీస్‌ శాఖ కిట్లతో అనుమానితులకు గంజాయి పరీక్షలు చేశారు. అనంతరం సీఐ మాట్లాడారు. గంజాయి రహిత జిల్లాగా మార్చాలని ఎస్పీ ప్రత్యేక చర్యలు చేపట్టారన్నారు. ఇందులో భాగంగానే వివిధ మం లాల్లోని కరకంఠాపురం, వేదాంతపురం ఎస్టీ కాలనీ, కేవీపురం దళితవాడ, పచ్చికాపల్లం, పాలసముద్రం దళితవాడ, పొదలపల్లె, కొటార్వేడులో కార్డన్‌ సెర్చ్‌తో ప్రతి గృహాన్ని తనిఖీ చేశామన్నారు. వాహనాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించామన్నారు. నేర చరిత్ర కలిగిన వ్యక్తులపై నిఘా ఉంచామన్నారు. కొటార్వేడులో సారాఊట ధ్వంసం చేసినట్లు చెప్పారు. ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ(డీటీసీ) జే.రాంబాబు డివిజన్‌లోని ఎస్సైలు, పోలీసులు పాల్గొన్నారు.

తిరుమల: బెంగళూరుకు చెందిన నిర్మాణ సంస్థ సముద్ర గ్రూప్‌ డైరెక్టర్‌ నవీన్‌ కుమార్‌ అనే భక్తుడు ఆదివారం టీటీడీ శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.11,11,111 లక్షలు విరాళం ఇచ్చారు. టీటీడీ అదనపు ఈఓ సీహెచ్‌ వెంకయ్య చౌదరికి తిరుమలలోని అదనపు ఈఓ చాంబర్‌లో విరాళం డీడీని దాత అందజేశారు. ఈ కార్యక్రమంలో దాత కుటుంబ సభ్యులు నాగారం మురళి, కుటుంబసభ్యులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement