స్నేహమేరా జీవితం.. | - | Sakshi
Sakshi News home page

స్నేహమేరా జీవితం..

Jun 8 2026 7:06 AM | Updated on Jun 8 2026 7:06 AM

గుడిపాల: స్నేహమేరా జీవితం..స్నేహమేరా శాశ్వతం– అని రెండున్నర దశాబ్దాల తర్వాత వారంతా సందడి చేశారు. తమ భవితకు బాటలు వేసిన పాఠశాలలో ఆదివారం కలిశారు. జ్ఞాపకాల పేజీలు తిరగేస్తూ బాల్య స్మతులతో కేరింతలు కొట్టారు. మండలంలోని నరహరిపేట ఉన్నత పాఠశాలలో 2002–2003లో పదవ తరగతి చదివిన విద్యార్థులు కాలక్రమంలో వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. మళ్లీ అందరూ కలవాలని ఫోన్లలో పరస్పరం చర్చించుకుని డేట్‌ నిర్ణయించడంతో ఆలస్యం ఎక్కడెక్కడి నుంచో అందరూ వాలిపోయారు. తమ తరగతి గదుల్లో తిరుగుతూ ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లారు. తమ విద్యాబుద్ధులు చెప్పిన గురుదేవులను సన్మానించి ఆశీస్సులు అందుకున్నారు. స్కూల్‌ అభివృద్ధి కోసం రూ.50వేలు విరాళంగా అందజేశారు. ప్రస్తుత ప్రధానోపాధ్యాయులు దూర్వాసులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement