చైన్నెలో 570 ఎలక్ట్రిక్‌ మినీ ఏసీ బస్సులు | - | Sakshi
Sakshi News home page

చైన్నెలో 570 ఎలక్ట్రిక్‌ మినీ ఏసీ బస్సులు

Jun 7 2026 3:51 AM | Updated on Jun 7 2026 3:51 AM

సాక్షి, చైన్నె: చైన్నె నగరంలో ప్రజా రవాణాను మెరుగుపరచడానికి, కాలుష్యాన్ని తగ్గించడానికి మహానగర రవాణా సంస్థ ఒక ప్రతిష్టాత్మక ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ మేరకు పెద్ద బస్సులు వెళ్లలేని ఇరుకై న రోడ్లు, రద్దీ ప్రాంతాలు , శివారు ప్రాంతాలు, మెట్రో రైలు, సబర్బన్‌ ఎలక్ట్రిక్‌ రైల్వే స్టేషన్లతో అనుసంధానించడమే లక్ష్యంగా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మొత్తం 570 ఎలక్ట్రిక్‌ మినీ ఏసీ బస్సుల నిర్వహణ కోసం టెండర్లు పిలిచారు. వీటిలో ఇప్పటికే 300 బస్సులు సిద్ధమై వినియోగంలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇవన్నీ లో–ఫ్లోర్‌ ఏసీ బస్సులు. ఇందులో 13 సీట్లు ఉంటాయి, మరో 10 మంది నిలబడేందుకు వీలుంది. ఈ బస్సుల్లో కండక్టర్‌ ఉండరు, కేవలం డ్రైవర్‌ మాత్రమే ఉంటారు. ప్రయాణికులు టిక్కెట్లను చైన్నె రవాణా యాప్‌ , స్మార్ట్‌ కార్డ్‌లు, లేదా నగదు ద్వారా డ్రైవర్‌ వద్దే చెల్లించి ప్రయాణించవచ్చు. ప్రతి 15 నిమిషాలకు ఒక మినీ బస్సు నడిచేలా టైమ్‌ టేబుల్‌ రూపొందించారు. ఈ సేవలు త్వరలో ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement