రెసిడెన్స్ కేంబ్రిడ్జ్
సాక్షి, చైన్నె: డీఏసీ డెవలపర్స్ నేతృత్వంలో చైన్నెలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ కారిడార్ అయిన ఓల్డ్ మహాబలిపురం రోడ్‌లో కొత్త శాటిలైట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. శనివారం. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి యుబీ గ్రూప్ వ్యవస్థాపకుడు గౌరవ్ కుమార్ , డీఏసీ డెవలపర్స్ వ్యవస్థాపకుడు సతీష్ కుమార్ సంతానం హాజరయ్యారు. రూ. 250 కోట్ల భారీ పెట్టుబడి ప్లాట్‌ఫారమ్‌గా చేపట్టిన ఈ ప్రాజెక్టుకు రూ. 66 కోట్ల నిధులను యుబి సమకూర్చిందని ప్రకటించారు. ఈ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తూ, రాబోయే ఏడాది కాలంలో భూసేకరణ అవకాశాలను పెంపొందించుకోవడానికి ముందుకెళ్లనున్నట్టు వివరించారు. ఈ కార్యాలయ ప్రారంభోత్సవంతో పాటు, డీఏసీ డెవలపర్స్ తమ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ డీఏసీ కేంబ్రిడ్జ్ ను అధికారికంగా ప్రారంభించారు. ఇంగ్లాండ్‌లోని ప్రముఖ కేంబ్రిడ్జ్ నగర నిర్మాణ శైలి, అక్కడి చారిత్రాత్మక వైభవం, ఆకర్షణీయమైన ఆర్కిటెక్చర్ స్ఫూర్తితో ఈ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌ను రూపకల్పన చేశారు.


