కేవీబీ నెట్‌ వర్క్‌ విస్తరణ | - | Sakshi
Sakshi News home page

కేవీబీ నెట్‌ వర్క్‌ విస్తరణ

Jun 7 2026 3:51 AM | Updated on Jun 7 2026 3:51 AM

కేవీబీ నెట్‌ వర్క్‌ విస్తరణ

సాక్షి, చైన్నె: కరూర్‌ వైశ్యా బ్యాంక్‌ తమిళనాడులో తన నెట్‌వర్క్‌ను మరింత విస్తరిస్తూ చైన్నెలోని విల్లివాక్కంలో సరికొత్త శాఖను ప్రారంభించింది.దేశవ్యాప్తంగా కరూర్‌ వైశ్యా బ్యాంకుకు ఇది 903వ బ్రాంచ్‌ కావడం విశేషం. తమిళనాడు పర్యాటక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, కమిషనర్‌ డాక్టర్‌ ఎం.ఎస్‌. షణ్ముగంఈ కొత్త శాఖను ప్రారంభించారు. కేఆర్‌ఎమ్‌ గ్రూప్‌ ఆఫ్‌ స్కూల్స్‌ ట్రస్టీ డాక్టర్‌ వసంత గౌరి సాంప్రదాయబద్ధంగా గాయత్రీ జ్యోతిని వెలిగించారు. బ్యాంక్‌ ఎండీ రమేష్‌ బాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఉత్తర చైన్నె పరిధిలోని నివాస ప్రాంతమైన విల్లివాక్కం ప్రజలకు, వ్యాపారులకు ఆధునిక బ్యాంకింగ్‌ సేవలను మరింత చేరువ చేయడమే ఈ బ్రాంచ్‌ లక్ష్యంగా వివరివంచారు.స్థానిక నివాసితులు, చిన్న తరహా పారిశ్రామికవేత్తలు, వర్తకులకు అవసరమైన వర్కింగ్‌ క్యాపిటల్‌ లోన్లు, ట్రేడ్‌ ఫైనాన్స్‌, డిజిటల్‌ పేమెంట్‌ టూల్స్‌ అందించడానికి కేవీబీ కట్టుబడి ఉందన్నారు. ఈ కొత్త బ్రాంచ్‌ ద్వారా ఇంటర్నెట్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌తో కూడిన సమగ్ర డిజిటల్‌ సేవలు అందుబాటులో ఉంటాయని వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement