అందులోనే నిజమైన ఆనందం | - | Sakshi
Sakshi News home page

అందులోనే నిజమైన ఆనందం

Jun 7 2026 3:51 AM | Updated on Jun 7 2026 3:51 AM

అందులోనే నిజమైన ఆనందం

తమిళసినిమా: మానవ సేవే మాధవ సేవ అంటారు. దీన్ని ఎంత మంది పాటిస్తారో తెలియదు కానీ మానవత్వం ఉన్న ప్రతిమనిషి చేతనైనా సాయం చేస్తుంటారు. అలాంటి సేవా భావం గురించి, అందులో కలిగే ఆనందం గురించి మృణాల్‌ఠాకూర్‌ ఇప్పుడే తెలుసుకున్నారట. ఈ ఉత్తరాది భామ బాలీవుడ్‌లో కంటే దక్షిణాదిలోనే నేమ్‌, ఫేమ్‌ తెచ్చుకున్నారు అని చెప్పవచ్చు. సీతారామం అనే తెలుగు చిత్రంతో దక్షిణాదిలో అడుగు పెట్టిన ఈ బ్యూటీ ఆ ఒక్క చిత్రంతోనే కావలసిన దానికంటే ఎక్కువ పాపులర్‌ అయ్యారు. ఆ తరువాత నటించిన హాయ్‌నాన్నా వంటి చిత్రాలు మృణాల్‌ఠాకూర్‌ కెరీర్‌కు ఉపయోగపడ్డాయి. ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లో నటిస్తున్న ఈ భామను కోలీవుడ్‌ ఎంట్రీకి ప్రయత్నాలు ముమ్మరంగానే జరుగుతున్నాయి. వాస్తవానికి ఇంతకుముందే శివకార్తికేయన్‌తో జత కట్టే అవకాశం వరించింది. కొన్ని కారణాల వల్ల ఆ చిత్రంలో నటించలేకపోయారు. తాజాగా ధనుష్‌ చిత్రంతో దిగుమతి అవడానికి రెడీ అవుతున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ బ్యూటీ ఇటీవల ఒక కార్యక్రమంలో జీవితంలో నిజమైన ఆనందం గురించి పేర్కొంటూ నేను ఇప్పటివరకు ఏదేదో ఆనందాన్ని ఇస్తుంది అని అనుకున్నాను.అయితే ఉన్నదానిలో ఇతరులకు ఇవ్వడంలోనే అసలైన సంతోషం కలుగుతుంది అని తెలుసుకున్నాను. పెద్ద మొత్తంలో కాకపోయినా ఉన్నదానితో కొంత లేనివారికి సాయం చేయాలి. కర్మపై నాకు చాలా నమ్మకం ఉంది. అయితే చేసిన సాయానికి ప్రతిఫలం ఉంటుందా అన్నదాని గురించి ఎదురు చూడను. అయితే చేసిన సాయం వల్ల ఎవరైనా సంతోష పెడితే చాలు అని మృణాల్‌ఠాకూర్‌ అన్నారు.

మృణాల్‌ఠాగూర్‌

Advertisement
 
Advertisement
Advertisement