తమిళసినిమా: విదార్థ్, కలైయరసన్, త్రిగుణ్, సంతోష్ ప్రతాప్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం మూండ్రామ్ కన్. ట్రెండింగ్ ఎంటర్‌టెయిన్‌మెంట్ అండ్ వైట్ హార్స్ స్టూడియోస్ సంస్థపై కే.శశికుమార్ నిర్మించిన ఈ చిత్రం ద్వారా సహోగణేశన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తేజుఅశ్విని, అతుల్య చంద్ర హీరోయిన్లుగా నటించిన ఇందులో జాన్‌విజయ్, కేపీవై శరత్ ముఖ్యపాత్రలు పోషించారు. రాజ్ ప్రతాప్ సంగీతాన్ని,ఉదయ్ కుమార్ చాయాగ్రహణం అందించారు. ఈనెల 12న చిత్రం తెరపైకి రానుంది. శుక్రవారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో దర్శకుడు చిత్రం గురించి తెలుపుతూ హైపర్ లింక్, ఆంథాలజీ నేపథ్యంలో రూపొందించిన క్రైమ్ థ్రిల్లర్, యాక్షన్ ఎంటర్‌టెయినర్ కథా చిత్రంగా ఇది ఉంటుందని చెప్పారు. కథ చెప్పగానే నూతన దర్శకుడు అని ఆలోచించకుండా తనపై నమ్మకంతో చిత్రాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చిన నిర్మాత శశికుమార్ కు ధన్యవాదాలు అన్నారు. చిత్ర నిర్మాత శశికుమార్ మాట్లాడుతూ దర్శకుడు చెప్పిన కథ తనకు చాలా బాగా నచ్చిందని, దీంతో వెంటనే నిర్మించడానికి సిద్ధమైనట్లు చెప్పారు. ప్రణాళిక ప్రకారం చిత్రాన్ని అద్భుతంగా తెరపై ఆవిష్కరించిన దర్శకుడు సహోగణేశన్ ధన్యవాదాలు అన్నారు.


