పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

Jun 7 2026 3:51 AM | Updated on Jun 7 2026 3:51 AM

కొరుక్కుపేట: పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపూ ఉందని ఇండియన్‌ కమ్యూనిటీ వెల్ఫేర్‌ ఆర్గనైజేషన్‌ (ఐసీడబ్ల్యూఓ) కార్యదర్శి ఏ జే హరిహరన్‌ అన్నారు. గ్రేటర్‌ చైన్నె కార్పోరేషన్‌ నిరాశ్రయుల ఆశ్రమంలోని నివాసితులు, సిబ్బంది భాగస్వామ్యంతో, దాని పైకప్పుపై ఒక రూఫ్‌ గార్డెన్‌న్‌ను ఏర్పాటు చేసి ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య సామాజిక అభివృద్ధి అధికారి (సీసీడీఓ), సామాజిక అభివృద్ధి అధికారి(సీఈఓ), అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌, సహాయ ఇంజినీర్‌ (ఏఈ) హాజరయ్యారు. అనంతరం, ఆశ్రమంలోని నివాసితులు పర్యావరణంపై అవగాహన కల్పించే రెండు నాటకాలు, ఒక పాటను ప్రదర్శించారు. అధికారులు ఆశ్రమవాసుల కృషిని అభినందించి, పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతను వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement