తిరుత్తణి: అగ్ని ప్రమాదాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించే విధంగా తిరుత్తణిలో శనివారం మాక్‌డ్రిల్ నిర్వహించారు. అగ్నిమాపక శాఖ ద్వారా అగ్ని ప్రమాదాలు పట్ల ప్రజలకు అవగహన కల్పించే విధంగా రండి నేర్చకుందాం నినాదంతో రెండు రోజుల పాటూ అగ్రిప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలను రాష్ట్రవాప్తంగా అగ్ని ప్రమాద శాఖ ద్వారా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తిరుత్తణిలోని అగ్ని ప్రమాద శాఖ కార్యాలయంలో అగ్ని ప్రమాద అధికారి సంపత్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన మాక్‌డ్రిల్ శిబిరంలో పట్టణ ప్రజలతో పాటూ కార్మికులు, విద్యార్ధులు పాల్గొన్నారు.


