వేలూరు: తిరువణ్ణామలై అన్నామలైయార్ ఆలయంలో స్వామి వారి దర్శనం కోసం భక్తులు బారులు దీరారు. పాఠశాల, కళాశాలలకు వేసవి సెలవులు ఇతర రాష్ట్రాల్లో ముగియనున్న నేపథ్యంలో ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. శనివారం వేకువ జామున ఆలయాన్ని తెరిచి అన్నామలైయార్, ఉన్నామలై అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు, పుష్పాలంకరణలు చేసి మహాదీపారాధన పూజలు చేశారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. క్యూలు భక్తులు నిండి పోవడంతో ఆలయంలో ఎటుచూసినా భక్తులతోనే కనిపించింది. సామాన్య దర్శనంలో రాజగోపురం, అమ్మనియమ్మన్ ఆలయం దారిలో భక్తులను దర్శనానికి అనుమతించారు. భక్తుల దర్శన సౌకర్యాలను ఆలయ జాయింట్ కమిషనర్ భరణీధరన్, ఆలయ అధికారులు పరిశీలించారు.


