తిరువళ్లూరు: ఒంటరిగా వున్న బాలికపై లైంగికదాడికి పాల్పడిన వడ్డీ వ్యాపారికి 9 ఏళ్ల జైలు శిక్షను విధి స్తూ తిరువళ్లూరు కోర్టు తీర్పును విధించింది. తిరు వళ్లూరు జిల్లా చోళ వరం యూనియన్ నెర్‌కుండ్రం ప్రాంతానికి చెందిన సురేష్ ఆంథోనిరాజ్(37). ఇతను స్థానికంగా నివాసం వుంటూ వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. దీంతో పాటు కొందరికి డబ్బులు ఇచ్చి దినసరి వసూలు చేస్తున్నాడు. ఈ క్రమంలో గత 2023వ సంవత్సరంలో 13 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం బయటకు విషయాన్ని చెబితే చంపేస్తామని బెదిరింపులకు దిగాడు. ఈ క్రమంలో బాలిక తల్లిదండ్రులు పనులకు వెళ్ళి సా యంత్రం ఇంటికి రావడంతో విషయాన్ని బాలి క తల్లిదండ్రులకు వివరించింది. బాధిత తల్లిదండ్రులు పుళల్ మహిళా పోలీసులకు పిర్యాదు చేశారు. సురేష్‌ఆంఽథోనిరాజ్‌ను పుళల్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం బెయిల్‌పై విడుదలైన క్రమంలో కేసు విచారణ తిరువళ్లూరు పోక్సో కోర్టులో సాగింది. విచారణ ముగిసిన క్రమంలో నిందితుడికి 9 ఏల్ల జైలు శిక్ష విధిస్తూ పోక్సో కోర్టు న్యాయమూర్తి ఉమామహేశ్వరి తీర్పును వెలువరించారు. అనంతరం నిందితుడిని పుళల్ జైలుకు తరలించారు.


