తమిళసినిమా: అగ్రకథానాయికిగా రాణిస్తున్న నయనతార నటించిన ఉమెన్ సెంట్రిక్ కథా చిత్రాల్లో అరమ్ ఒకటి. సామాజికపరమైన సమస్యలు, నీటి సమస్యలు, బావిలో పడ్డ చిన్నారిని రక్షించడానికి చేసే ప్రయత్నాలు వంటి పలు అంశాలను తెరపై ఆవిష్కరించిన కథా చిత్రం ఇది. నయనతార జిల్లా కలెక్టర్‌గా ప్రజల పక్షాన నిలిసి పోరాటం చేసిన పాత్రలో నటించి మెప్పించిన ఈ చిత్రాన్ని కేజేఆర్ స్టూడియోస్ పతాకంపై గోపి నయినార్ కేజేఆర్ నిర్మించారు. 2017లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. నయనతార నటించిన అతికొద్ది ఉమెన్ సెంట్రిక్ కథా చిత్రాల్లో మంచి విజయాన్ని సాధించిన చిత్రం ఇది. ఈ చిత్రానికి సీక్వెల్ ఎప్పుడు రూపొందుతుందా అని ఎదురుచూస్తున్న నయనతార అభిమానులను ఖుషీ పరిచే వార్త ఇప్పుడు వచ్చింది. ఈ చిత్రానికి సీక్వెల్ కథ పూర్తిగా రెడీ అయిందని నిర్మాత కేజేర్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈయన హీరోగా నటించిన తొలి చిత్రం అంగీకారం. అథ్లెటిక్స్ క్రీడా నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ చిత్రం ప్రమోషన్లో భాగంగా ఈయన అరమ్–2 చిత్రానికి సంబంధించిన వివరాలను తెలిపారు. ఇందులో నయనతారనే ప్రధాన పాత్రను పోషిస్తారా? లేక మరెవరైనా నటిస్తారా అనే పూర్తి వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం నయనతార సల్మాన్‌ఖాన్‌తో హిందీలో నటిస్తూ బిజీగా ఉన్నారు.
తమిళసినిమా: ఈ తరం హీరోయిన్ల ఆలోచనా ధోరణియే వేరు. తమకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం పోరాడుతున్నారనే చెప్పాలి. ప్రేమ, పెళ్లి విషయం ఎత్తితేనే అందుకు చాలా సమయం ఉందంటున్నారు. యువ నటి నికిలావిమల్ ఇలాంటి అభిప్రాయానే వ్యక్తం చేస్తున్నారు. మలయాళంలో బాల నటిగా పలు చిత్రాల్లో నటించిన ఈ భామ ఆ తరువాత తమిళం, తెలుగు భాషల్లో కథానాయికిగా నటిస్తూ తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవడానికి శ్రమిస్తున్నారు. తమిళంలో వెట్రివేల్, కిడారి, పంచుమిట్టాయి, తంబి, పోర్ తొళిల్ వంటి చిత్రాల్లో నటించారు. ఇటీవల మారిసెల్వరాజ్ దర్శకత్వంలో రూపొందిన వాళై చిత్రంలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. తమిళం తెలుగు, మలయాళం భాషల్లో నటిస్తున్న నికిలా విమల్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ప్రేమ, పెళ్లి గురించి మాట్లాడుతూ తన మనసులో ఇప్పటివరకూ ఎవరూ లేరని, తానెవరినీ ప్రేమించడం లేదని తెలిపారు. పెళ్లి గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అన్నారు. ప్రేమ, పెళ్లి వంటివి పెద్ద విషయం కాదు అని, అలాంటి ఆలోచన వచ్చినప్పుడు చూసుకో వచ్చునని అన్నారు. ఇప్పుడు తన ఆలోచనలు అంతా సినిమా చుట్టూనే అని నికిలా విమల్ చెప్పారు.
నికిలా విమల్
అరమ్–2కు కథ రెడీ!


