తమిళసినిమా: ముఖ్యమంత్రి విజయ్ వారసుడు జసన్ సంజయ్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం సిగ్మా. లండన్‌లో సినిమా విద్యను చదివిన ఈయన హీరోగా రంగప్రవేశం చేస్తారని చాలా మంది భావించారు. అయితే అనూహ్యంగా తను మెగాఫోన్ పట్టి సిగ్మా అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో విజయ్‌సేతుపతి, ప్రముఖు నటుల్లో ఒకరు నటిస్తారనే ప్రచారం జరిగింది. చివరికి సందీప్కిషన్ హీరోగా నటిస్తున్నారు. నటి ఫరియఅబ్దుల్ నాయకిగా నటించారు. లైకా ప్రొడక్షన్‌న్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం జూలై 31న తెరపైకి రానుంది. ఇప్పటికే చిత్ర టైటిల్, టీజర్‌ను విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. తాజాగా సిగ్మా చిత్ర ప్రోమోను విడుదల చేశారు. ఇది ఇప్పుడు నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. ఇందుకు కారణం ఈ ప్రోమోలో దర్శకుడు జసన్‌సంజయ్ కూడా నటించడమే. ఆయన చిత్ర ప్రోమోలోనే కనిపిస్తారా? లేక చిత్రంలోనూ కీలక పాత్రను పోషించారా అనేఆసక్తి నెలకొంది. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడానికి యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి జోసఫ్ విజయ్ పాల్గొంటారా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. మొత్తం మీద సిగ్మా టాక్ ఆఫ్ ద సినిమాగా మారింది. ఇక చిత్రం రిజల్ట్ ఎలా ఉంటుందన్న ఆసక్తి నెలకొంది.


