పళ్లిపట్టు: పళ్లిపట్టులో శుక్రవారం జమాబందీ ము గింపు కార్యక్రమంలో 92 మంది అర్హులను ఎంపిక చేసి ప్రభుత్వ సహాయకాలు పొందేందుకు వీలుగా సర్టిఫికెట్లను ఎమ్మెల్యే హరి పంపిణీ చేశా రు. పళ్లిపట్టు తాలూకాలో మంగళవానం జమాబందీ శిబి రం ప్రారంభమైంది. తిరుత్తణి ఆర్డీఓ కనిమొళి అధ్యక్షతన నిర్వహించిన శిబిరంలో గ్రామీణులు పాల్గొని అర్జీలు అందజేశారు. నాలుగు రోజుల పాటు నిర్వహించిన శిబిరం ముగింపు కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఇందులో తిరుత్తణి ఎమ్మెల్యే హరి పాల్గొన్నారు. మొత్తం 367 మంది అర్జీలు సమర్పించగా, పరిశీలించి 92 మందిని అర్హు లుగా ఎంపిక చేశారు. వారికి సర్టిఫికెట్లను ఎమ్మెల్యే హరి అందజేశారు. తక్కిన 275 అర్జీల పట్ల 30 రోజుల్లో విచారణపూర్తి చేసి న్యాయం చేస్తామని ఆర్డీఓ తెలిపారు. తహసీల్దారు భారతి, టీఎస్‌ఓ రీటా, అన్నాడీఎంకే యూనియన్ కార్యదర్శులు కృష్ణమనాయుడు, టీడీ.శ్రీనివాసన్ పాల్గొన్నారు.


