చైన్నెలో గ్లోబల్‌ స్కూల్‌ ఆఫ్‌ ఏవీయేషన్‌ కేంద్రం | - | Sakshi
Sakshi News home page

చైన్నెలో గ్లోబల్‌ స్కూల్‌ ఆఫ్‌ ఏవీయేషన్‌ కేంద్రం

Jun 5 2026 4:29 AM | Updated on Jun 5 2026 4:29 AM

సాక్షి, చైన్నె: భారతదేశంలోనే అతిపెద్ద విమానాశ్రయ గ్రౌండ్‌ హ్యాండ్లింగ్‌ సేవల సంస్థలలో ఒకటైన ’గ్లోబల్‌ ఫ్లైట్‌ హ్యాండ్లింగ్‌ సర్వీసెస్‌ చైన్నెలో గ్లోబల్‌ స్కూల్‌ ఆఫ్‌ ఏవియేషన్‌ క్యాంపస్‌లో సరికొత్తగా విస్తరించిన శిక్షణ మౌలిక సదుపాయాల కేంద్రాన్ని నెలకొల్పింది. యూడీఎస్‌ గ్రూప్‌లో భాగమైన ఈ సంస్థ ఏర్పాటు చేసిన కొత్త కేంద్రాన్ని తమిళనాడు రెవెన్యూ , విపత్తు నిర్వహణ శాఖ మంత్రి కే.ఏ. సెంగోట్టయన్‌ ప్రారంభించారు. గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో చైన్నె అంతర్జాతీయ విమానాశ్రయ డైరెక్టర్‌, సీఐఎస్‌ఎఫ్‌ డీఐజీ, పొన్ని ఐపీఎస్‌, బీసీఏఎస్‌ , ఏఏఐ సంస్థల ఉన్నతాధికారులతో పాటు జీఎఫ్‌హెచ్‌ఎస్‌, జీఎస్‌ఏ, ఏఎస్‌డీఐ విద్యా సంస్థల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీఎఫ్‌హెచ్‌ఎస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సరితా కుమారి మాట్లాడుతూ.. అద్భుతమైన సేవలు, నిబంధనల అమలు, నైపుణ్యాభివృద్ధి అనే సూత్రాలకు కట్టుబడి తమ సంస్థ పనిచేస్తున్నట్టు వివరించారు. విమానయాన రంగ అభివృద్ది ప్రయాణంలో నమ్మకమైన భాగస్వామిగా జీఎఫ్‌హెచ్‌ఎస్‌ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటున్నట్టు వివరించారు .యూజీసీ గుర్తింపు పొందిన బీబీఏ , బీఎస్సీ ఏవియేషన్‌ వంటి డిగ్రీలతో పాటు పలు సర్టిఫికేట్‌ డిప్లొమా కోర్సులను అందిస్తున్నట్టు ప్రకటించారు. అమెట్‌ విశ్వవిద్యాలయంతో కలిసి ప్రత్యేకమైన మూడేళ్ల బీబీఏ , బీఎస్సీ ఏవియేషన్‌ కోర్సులను అందిస్తున్నట్టు గుర్తు చేస్తూ, ఈ ఉమ్మడి ప్రోగ్రామ్‌ కింద ఎంపికై న అర్హులైన విద్యార్థులకు, కోర్సులో చేరిన తొలి రోజునే ఉద్యోగ నియామక పత్రం అందజేయడం జరిగిందన్నారు. విమానయాన విద్యా రంగంలో ఇదొక విప్లవాత్మకమైన ముందడుగుగా పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement