రొమాంటిక్‌ థ్రిల్లర్‌గా అందరన్‌ | - | Sakshi
Sakshi News home page

రొమాంటిక్‌ థ్రిల్లర్‌గా అందరన్‌

Jun 5 2026 4:29 AM | Updated on Jun 5 2026 4:29 AM

తమిళసినిమా: గిరీష్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎంకే.సాంబశివం నిర్మించిన చిత్రం అందరన్‌. సంతోష్‌రావణన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నటుడు ప్రజన్‌, ఇవానా వరుణ్‌ హీరోహీరోయిన్గా నటించారు. అనుపమకుమార్‌, ఆదిరన్‌ పద్మన్‌, అరువిబాలా, ఎంకే.సాంబశివం, రమేష్‌బాబు, అర్జున్‌దేవ్‌, ప్రియాంకసెల్వి, ఐశ్వర్య కన్నన్‌, వీజే. రాజు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం ఈ నెల 25న తెరపైకి రానుంది. స్థానిక సాలిగ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దర్శకుడు సంతోష్‌ రావణన్‌ మాట్లాడుతూ అందరన్‌ అంటే హంటర్‌ అని అర్థం అన్నారు. ఒక సీరియస్‌ కథాంశంతో రూపొందించిన కథా చిత్రం అందరన్‌ అని చెప్పారు. ప్రస్తుతం కోర్టులో ఉన్న ఒక సంఘటన ఆధారంగా రూపొందించిన ఈ విషయాన్ని తాను ఇప్పటివరకు నిర్మాతకు కూడా చెప్పలేదన్నారు. ఇది రొమాంటిక్‌ థ్రిల్లర్‌ కథా చిత్రంగా ఉంటుందని అన్నారు. ఈ చిత్రం కై ్లమాక్స్‌లో ఒక ప్రత్యేక విషయం ఉంటుందని చెప్పారు. చిత్ర నిర్మాత సాంబశివం మాట్లాడుతూ తాను ఇంతకుముందు అడవి, మనిదర్గళ్‌ చిత్రాలను నిర్మించానని, ఆ రెండు చిత్రాలతో ఈ చిత్రానికి మంచి కనెక్ట్‌ ఉందని పేర్కొన్నారు. ఇందులో సమాజానికి అవసరమైన ఒక విషయాన్ని చెప్పామన్నారు. దాన్ని క్రైమ్‌ థ్రిల్లర్‌ రూపంలో చెప్పామని నిర్మాత పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement