మెగాఫోన్‌ పట్టనున్న మరో వారసురాలు | - | Sakshi
Sakshi News home page

మెగాఫోన్‌ పట్టనున్న మరో వారసురాలు

Jun 5 2026 4:29 AM | Updated on Jun 5 2026 4:29 AM

తమిళసినిమా: రాఘవ లారెన్‌న్స్‌ పేరు వింటే వెంటనే గుర్తుకు వచ్చేది డాన్‌న్స్‌. తాను నృత్య దర్శకత్వంలో చిరంజీవి, నాగార్జున, రజనీకాంత్‌ వంటి స్టార్స్‌ను ఆడించారు. ఇకపోతే ఈయన పేరు చెబితే గుర్తుకు వచ్చే మరో విషయం హారర్‌ థ్రిల్లర్‌ కథా చిత్రాలు. ముని చిత్రం నుంచి కాంచన 3 వరకు హారర్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో చిత్రాలు చేసి సక్సెస్‌ను సాధించారు. ప్రస్తుతం కాంచన 4 చిత్రాన్ని చేస్తున్నారు. అదేవిధంగా ఇతర దర్శకుడితో బెంచ్‌ అనే చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఇలా నృత్య దర్శకుడు, కథానాయకుడు, నిర్మాత, దర్శకుడిగా మంచి విజయాలను సాధిస్తున్న రాఘవ త్వరలో తన వారసురాలిని రంగంలోకి దింపబోతున్నారనే వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. లారెన్‌న్స్‌ రాఘవేంద్రస్వామి భక్తుడు అన్నది తెలిసిందే. ఈయన కూతురికి రాఘవి అనే నామకరణం చేశారు. ఈమె ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా? అమెరికాలో సినిమాకు సంబంధించిన విద్యను చదువుతున్నారట. త్వరలోనే చైన్నెకి తిరిగి వస్తున్నట్లు సమాచారం. అంతేకాదు ఆమె త్వరలోనే మెగాఫోన్‌ పట్టడానికి సిద్ధం అవుతున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement