పెద్దకుప్పంలో ఎస్పీ తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

పెద్దకుప్పంలో ఎస్పీ తనిఖీలు

Jun 5 2026 4:23 AM | Updated on Jun 5 2026 4:23 AM

తిరువళ్లూరు: నిత్యం రద్దీగా వుండే పెద్దకుప్పం ప్రాంతంలో చైన్‌ స్నాచింగ్‌ జరిగిన నేపథ్యంలో ఎస్పీ వివేకనందశుక్లా గురువారం ఉదయం తనిఖీలు నిర్వహించారు. తిరువళ్లూరులోని రైల్వేస్టేషన్‌ ప్రాంతం నిత్యం రద్దీగా వుంటుంది. ఇక్కడ ప్రయాణికులతోపాటు ఆటోలు, బస్సులు, ద్విచక్ర వాహనాలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటాయి. నిత్యం రద్దీగా వుండే పెద్దకుప్పం ప్రాంతంలో రెండు రోజుల క్రితం యువతి వద్ద చైన్‌ స్నాచింగ్‌ చేయడానికి కొందరు యత్నించారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపిన క్రమంలో ఎస్పీ వివేకానందశుక్లా గురువారం ఉదయం తనిఖీలు నిర్వహించారు. పెద్దకుప్పం ప్రాంతంలో ఇకపై పోలీసుల పికెటింగ్‌ చేయాలని గస్తీని పెంచాలని పోలీసులను ఆదేశించారు. రద్దీగా వున్న సమయంలో ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్‌ను పునరుద్ధరించాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement