సాక్షి, చైన్నె: తమిళనాడులో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ’టాస్మాక్’ మద్యం అమ్మకాల వ్యవస్థలో భారీ మార్పులు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో మాదకద్రవ్యాల సంస్క్కృతికి అడ్డుకట్ట వేయాలని, ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న అన్యాయాలకు గంజాయి, మితిమీరిన మద్యం అమ్మకాలే కారణమని భావిస్తున్న ముఖ్యమంత్రి విజయ్ ఆ దిశగా కఠిన నిర్ణయాలు తీసు కుంటున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా విడతల వారీగా 500 మద్యం దుకాణాలను మూసివేయగా, మిగిలిన నిర్దేశిత దుకాణాలను మూసివేసే ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,171 ప్రభుత్వ మద్యం దుకాణాలు నడుస్తున్నాయి.
ప్రైవేటీకరణ దిశగా అడుగులు
ఇటీవలి కాలంలో టాస్మాక్ దుకాణాల్లో ప్రతి మ ద్యం బాటిల్‌పై రూ.10 కొన్ని చోట్ల, మరికొన్ని చో ట్ల రూ. 20 అదనంగా వసూలు చేస్తున్నారనే అంశం సోషల్ మీడియాలో తీవ్ర వివాదంగా మారింది. ప్ర భుత్వ సంస్థే ఇలా అవినీతికి పాల్పడుతోందనే చెడ్డపేరు వస్తుండటంతో సీఎం విజయ్ అధికారులతో అత్యవసర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ప్రభుత్వ పరిశీలనలోని కొత్త విధానాలు
పుదుచ్చేరిలో ప్రభుత్వ సహకార సంఘాలతో పాటు ప్రైవేట్ వ్యక్తులు కూడా మద్యం విక్రయించడం జరు గుతున్నది. అక్కడ మద్యంపై ప్రభుత్వ నియంత్రణ ఉన్నప్పటికీ, దుకాణాల బాధ్యత ప్రైవేట్ వర్గాలదే ఉంటుంది. ఈ విధానాన్ని తమిళనాడులో అమలు చేస్తే వచ్చే లాభనష్టాలపై నివేదిక ఇవ్వాలని సీఎం అధికారులను కోరారు. అలాగే, కేరళలో అనుసరిస్తున్న మద్యం విక్రయ పద్ధతులను పరిశీలించి, ప్రస్తుతం జరుగుతున్న తప్పులను, అవినీతిని అరికట్టవచ్చని అధికారులు సీఎంకు సూచించడం గమనార్హం.
ఉద్యోగుల భద్రతపై దృష్టి
ఒకవేళ మద్యం విక్రయాలను పూర్తిగా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే, ప్రస్తుతం టాస్మాక్‌లో పనిచేస్తున్న వేలాది మంది కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి ఎలా కల్పించాలనే దానిపై కూడాచర్చించడం గమనార్హం. ప్రభుత్వ కొనుగోలు, పంపిణీ వ్యవస్థను తన వద్దే ఉంచుకుని, అమ్మకాలను ప్రైవేటీకరించే ఈ సరికొత్త పద్ధతి రాబోయే రెండు నెలల్లో అమల్లోకి వచ్చే అవకాశం ఉందని సచివాలయ వర్గాలు వెల్లడించాయి. కాగా, ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వానికి టాస్మాక్ ద్వారా సుమారు 40 వేల కోట్ల మేరకు ఆదాయం వస్తుండటం గమనార్హం.


