అముముకలోకి ఇతర పార్టీ నేతలు | - | Sakshi
Sakshi News home page

అముముకలోకి ఇతర పార్టీ నేతలు

Jun 4 2026 5:10 AM | Updated on Jun 4 2026 5:10 AM

వేలూరు: వేలూరు జిల్లా అనకట్టు నియోజకవర్గం పరిధిలోని విరింజిపురం గ్రామంలోని ఇతర పార్టీలకు చెందిన 200 మంది కార్యకర్తలు బుధవారం ఉదయం అముముక పార్టీలో చేరారు. ముందుగా అముముక పార్టీ ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ నాయకత్వంలో వేలూరు జిల్లా కార్యదర్శి పీకేఆర్‌ సతీష్‌కుమార్‌ సమక్షంలో ఇతర పార్టీలకు చెందిన కార్యకర్తలు పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో వారికి పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. అదేవిధంగా కాట్పాడి నియోజక వర్గం పరిధిలోని కుప్పుతామోటూరు గ్రామ పంచాయతీ పరిధిలోని కార్యకర్తలు పార్థిబన్‌ అధ్యక్షతన పలువురు పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి పార్టీ కండువా కప్పి స్వాగతం పలకడంతోపాటు స్వీట్లు పంచి పెట్టారు. పార్టీ జిల్లా ఆర్గనైజింగ్‌ కార్యదర్శి కమలనాథన్‌, కోశాధికారి సుందరమూర్తి, కాట్పాడి యూనియన్‌ కార్యదర్శిబాబు, తిరువలం పట్టణ పంచాయతీ కార్యదర్శి విజయభాస్కర్‌, ఐటీ విభాగం కార్యదర్శి ఏలుమలై, విద్యార్థి విభాగం కార్యదర్శి సత్యరాజ్‌, చేనేత విభాగం కార్యదర్శి ధనశేఖర్‌, అనకట్టు యూనియన్‌ కార్యదర్శి శరవణన్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement