కోలాహలం.. పరదరామి జాతర | - | Sakshi
Sakshi News home page

కోలాహలం.. పరదరామి జాతర

Jun 4 2026 5:10 AM | Updated on Jun 4 2026 5:10 AM

కోలాహలం.. పరదరామి జాతర

వేలూరు: గుడియాత్తం తాలుకా పరదరామిలో తిరుమల తిరుపతి గంగయమ్మన్‌ ఆలయ జాతరను పురస్కరించుకొని శిరస్సు జాతర బుధవారం కోలాహలంగా జరిగింది. పరదరామి గంగయమ్మన్‌ జాతరలో భాగంగా ఉదయం గ్రామదేవత ఆలయంలోని అమ్మన్‌ శిరస్సుకు ప్రత్యేక పూజలు చేసి భక్తుల కోలాహలం మధ్యన శిరస్సును ఊరేగింపుగా తీసుకొచ్చి పాలారు నది ఒడ్డున ఉన్న ఆలయంలోని విగ్రహానికి అమర్చారు. ఊరేగింపులో భక్తులు వివిధ వేశధారణలు ధరించి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. జాతరకు వేలసంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. భక్తుల దాహార్తిని తీర్చేందుకు అక్కడక్కడే నీరు, మజ్జిగ, అంబలి,అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు అవసరమైన ఏర్పాట్లను ఆల య నిర్వాహకులు, ఉత్సవ కమిటీ భక్తులు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశారు. పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. జాతర ముగింపులో రాత్రి బాన వేడుకలను ఏర్పాటు చేశారు. జాతర సందర్భంగా చిత్తూరు నుంచి యాదమరి మీదుగా వచ్చే వాహనాలను కాట్పాడి మీదుగా మల్లించారు.

Advertisement
 
Advertisement
Advertisement