అలా ౖపైపెకి రష్మిక! | - | Sakshi
Sakshi News home page

అలా ౖపైపెకి రష్మిక!

Jun 4 2026 4:58 AM | Updated on Jun 4 2026 4:58 AM

తమిళసినిమా: సినిమా ఒక్కసారి ముద్దుగా అక్కున చేర్చుకుంది అంటే ఊహించనంత తీరాలకు తీసుకెళ్లి కూర్చో పెడుతుంది. అలాంటి వారిలో రష్మికమందన్నా ఒకరు. ఎక్కడో కర్ణాటకలోని గ్రామంలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ మొదట్లో మాతృభాషలో కథానాయకిగా పరిచయమయ్యారు. ఆ తరువాత టాలీవుడ్‌లోకి దిగుమతి అయి గీత గోవిందం చిత్రంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. ఆ తరువాత పుష్ప చిత్రంతో పాన్‌ ఇండియా స్థాయిలో ఫేమస్‌ అయ్యారు. ఇక గుడ్‌బై చిత్రంతో బాలీవుడ్లో పాగా వేసిన రష్మిక యానిమల్‌ చిత్రంతో కమర్షియల్‌గా సూపర్‌హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ఆ తరువాత ఒకటి రెండు చిత్రాలు ఫ్లాప్‌ అయినా కేరీర్‌కు వచ్చే డోకా ఏమీ ఉండదు. రష్మిక విషయంలో ఇదే జరుగుతోంది. సల్మాన్‌ఖాన్‌కు జంటగా నటించిన చిత్రం నిరాశ పరిచింది. ఇటీవల నటుడు విజయ్‌ దేవరకొండను ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. ఇక్కడ పెళ్లి అయిన హీరోయిన్లకు కెరీర్‌ దెబ్బ తింటుందన్న ఆనవాయితీని ఈ బ్యూటీ తిరగరాశారు. ఇప్పుడు ఈ క్రేజీ భామ రేంజ్‌కు వరుసగా భారీ అవకాశాలు రావడమే కాదు పారితోషికాన్ని భారీ మొత్తంలో ముట్టచెబుతున్నారు. అది ఎంతగా అంటే ఇప్పటి వరకు దక్షిణాది టాప్‌ హీరోయిన్లు తీసుకుంటున్న పారితోషికాన్ని బీట్‌ చేసేంతగా. ఇప్పటి వరకు దక్షిణాది హీరోయిన్లలో అత్యధికంగా నయనతార రూ.10 కోట్ల తీసుకుంటున్న ప్రచారం జరుగుతోంది. రష్మిక ఇప్పుడు కాక్‌–టెయిల్‌–2 చిత్రంలో రూ.15 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఇదే నిజమైతే పారితోషికం విషయంలో ఈ అమ్మడు నయనతారను బీట్‌ చేసినట్లే అవుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement