ఊటీలో రజనీకాంత్‌ | - | Sakshi
Sakshi News home page

ఊటీలో రజనీకాంత్‌

Jun 4 2026 4:58 AM | Updated on Jun 4 2026 4:58 AM

– అభిమాన సంఘాల నేతలతో సంప్రదింపులు

సాక్షి, చైన్నె: సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ సైలెంట్‌గా ఊటీలో ల్యాండ్‌ అయ్యారు. సూపర్‌ స్టార్‌ మంగళవారం మైసూర్‌ మీదుగా రోడ్డు మార్గంలో ఊటీకి చేరుకున్నారు. ఊటీలోని ప్రముఖ బాలీవుడ్‌ నటుడు మిథున్‌ చక్రవర్తికి చెందిన హోటల్‌లో రజనీకాంత్‌ బస చేశారు. రజనీకాంత్‌ ఊటీకి వచ్చారనే విషయం రాత్రి వరకు పోలీసులతో సహా ఎవరికీ తెలియకుండా అత్యంత రహస్యంగా ఉంచారు. అయితే, అర్ధరాత్రి సమయంలో ఈ విషయం రజనీ మక్కల్‌ మండ్రం (అభిమాన సంఘం) నిర్వాహకులకు, స్థానిక అభిమానులకు తెలియడంతో ఊటీ ఒక్కసారిగా ఊగిపోయింది. ఆయన బస చేసిన హోటల్‌ ముందర తెల్లవారేసరికి వందలాది మంది అభిమానులు గుమిగూడారు. తలైవాను ఒక్కసారైనా చూడాలనే తపనతో హోటల్‌ ప్రధాన ప్రవేశ ద్వారాన్ని అభిమానులు పూర్తిగా ముట్టడించారు. పరిస్థితిని గమనించిన హోటల్‌ యాజమాన్యం , సెక్యూరిటీ.. రజనీకాంత్‌ అనుమతితో అభిమాన సంఘంలోని కేవలం ముఖ్యమైన నిర్వాహకులను మాత్రమే లోపలికి అనుమతించారు. త నను కలవడానికి వచ్చిన అభిమాన సంఘం కార్యనిర్వాహకులను రజనీకాంత్‌ ఎంతో ఆప్యాయంగా పలకరించారు.

Advertisement
 
Advertisement
Advertisement