సాక్షి, చైన్నె: వాతావరణ, శీతోష్ణస్థితి శాస్త్రాల రంగంలో పరిశోధన , విద్యా కార్యకలాపాలలో సహకారాన్ని సులభతరం చేసే లక్ష్యంతో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెటియోరాలజీ ( ఐఐటీఎం)తో ఎస్‌ఆర్‌ఎం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అవగాహన ఒప్పందం చేసుకున్నట్టు ఎస్‌ఆర్‌ఎం ఐఎస్‌టీ ఛైర్మన్ డాక్టర్ ఆర్ శివకుమార్ తెలిపారు . ఈ మేరకు బుధవారం జరిగిన సమావేశంలో అవగాహన ఒప్పంద ప్రతాలపై ఎస్‌ఆర్‌ఎం ఐఎస్‌టీ ఛైర్మెన్ డాక్టర్ శివకుమార్, ఐఐటీఎం పూణే డైరెక్టర్ డాక్టర్ సూర్య చంద్రరావులు సంతకాలు చేశారు. భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ అభివద్ధి చేసిన మిషన్ మౌసం అర్బన్ టెస్ట్‌బెడ్ అండ్ పరిశీలనా సౌకర్యాన్ని ఎస్‌ఆర్‌ఎం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ– రామపురం క్యాంపస్‌లో ప్రారంభించింది . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎర్త్ సైన్సెస్ సెక్రటరీ డాక్టర్ ఎం రవిచంద్రన్ పాల్గొని దీనిని ప్రారంభించారు. చైన్నె ప్రాంతంలో ఏకై క సదుపాయమైన అర్బన్ టెస్ట్‌బెడ్ రుతుపవనాల అంచనా, నౌకాస్టింగ్, తీవ్రమైన వాతావరణంపై ముందస్తు హెచ్చరికలను మెరుగుపరచడానికి నగరం అంతటా ఏరోసోల్స్, మేఘాలు, వర్షపాతం, వాతావరణ గతిశీలతలను పర్యవేక్షించనుంది. ఈ సందర్భంగా డాక్టర్ శివకుమార్ మాట్లాడుతూ, రామపురంలోని ఎస్‌ఆర్‌ఎం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో చైన్నె అర్బన్ టెస్ట్‌బెడ్ అర్బన్ ఏరోసోల్ అబ్జర్వేషనల్ ఫెసిలిటీకి ఆతిథ్యం ఇవ్వడం మాకు గర్వకారణంగా ఉందని అన్నారు. ఈ ముఖ్యమైన జాతీయ కార్యక్రమం కోసం ఎస్‌ఆర్‌ఎంఐఎస్టీని ఎంచుకున్నందుకు ఐఐటీఎం , భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖకు తాము ధన్యవాదాలు తెలిపారు. ఇందులో ఐఐటీఎం ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ తారా ప్రభాకరన్, ఎస్‌ఆర్‌ఎంఐఎస్‌టీ డీన్ (ఈ అండ్‌టీ) డాక్టర్ ఎం. శక్తి గణేష్‌తో పాటుూ భాగస్వామ్య సంస్థల డైరెక్టర్లు పాల్గొన్నారు.
వృద్ధురాలిని హత్య చేసి నగలు దోపిడీ
– దోపిడీ సొమ్ముతో యాత్రకు వెళ్లిన నవవరుడు
అన్నానగర్: కోయంబత్తూరులోని రామనాథపురంలో ఒక అపార్ట్‌మెంట్ భవనంలోని 2వ అంతస్తులో గోమతి (69) ఒంటరిగా నివసిస్తుంది. దస్తావేజు నమోదు శాఖ లో పని చేసి పదవి విరమణ పొందిన ఆమె భర్త 10 సంవత్సరాలకు ముందు మృతి చెందాడు. ఆ దంపతులకు ఒక కుమారుడు, రాధిక అనే కుమార్తె ఉన్నారు. ఇద్దరికీ పైళ్లె విదేశాల్లో నివసిస్తున్నారు. ఇక్కడ గోమతి ఒంటరిగా ఉంది. కంటి శస్త్రచికిత్స చేయించుకోవడంలో సహాయం కోసం గోమతి తన కూతురు రాధికను పిలిచింది. గత 3వ తేదీన, రాధిక తన తల్లిని చూడటానికి కోయంబత్తూరుకు వచ్చింది. ఆమె ఇంటికి వెళ్లినప్పుడు, గదిలో గోమతి చనిపోయి ఉండటాన్ని చూసి దిగ్భ్రాంతి చెందిన ఆమె, ఈ సంఘటన గురించి రామనాథపురం పోలీసులకు తెలియజేశారు. పోలీసుల విచారణలో తరచూ ఆ వృద్ధురాలి బట్టలను ఉతకడానికి తీసుకువెళ్లే కుంభకోణానికి చెందిన రంజిత్ కుమార్ (24) వృద్ధురాలి నగల కోసం ఆమెను గొంతు నులిమి చంపేసినట్లు తెలిసింది. తర్వాత అతను దొంగిలించిన నగలతో తన సొంత ఊరికి వెళ్లి, అక్కడి ఒక నగల దుకాణంలో వాటిని రెండు లక్షల రూపాయలకు అమ్ముకున్నాడు. ఆ తర్వాత, ఆ డబ్బు తీసుకుని తన భార్యతో కలిసి రామేశ్వరం యాత్రకు వెళ్లాడని పోలీసులు తెలిపారు. దీని తర్వాత పోలీసులు రంజిత్‌కుమార్‌ను అరెస్టు చేశారు. అతనిపై దర్యాప్తు కొనసాగుతోంది.
కొరుక్కుపేట: గత ఏడాదిలో 2.49 లక్షల రైలు ప్రయాణాలు పూర్తిగా బుక్ కావడంతో రిజర్వుడ్ సీట్ల జాబితాలో దక్షిణ రైల్వే అగ్రస్థానంలో నిలిచిందని రైల్వే అధికారులు తెలిపారు. దేశంలో ప్రధాన రవాణా రైల్వే వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల మధ్య నడిచే రైళ్లలో ఎప్పుడూ రద్దీ ఉంటుంది. అందువల్ల ప్రయాణికులు ముందుగానే సీట్లు రిజర్వు చేసుకుంటారు. 60 రోజుల ముందుగానే టికెట్లు బుక్ చేసుకునే సౌకర్యం ఉన్నందున, చాలామంది తమ ప్రయాణాన్ని ప్రణాళిక వేసుకుని రిజర్వు చేసుకుంటారు. ముందుగా టికెట్లు బుక్ చేసుకుని, సక్రమంగా ప్రయాణించే ప్రయాణికుల శాతం ఇది. మొత్తం 18 రైల్వే జోన్‌న్‌లలో, చైన్నె ప్రధాన కార్యాలయంగా ఉన్న దక్షిణ రైల్వే జోన్ మొదటి స్థానంలో ఉంది. దక్షిణ రైల్వే 2.49 లక్షల మందికి రిజర్వేషన్ బుక్ చేసింది. దీంతో అగ్రస్థానంలో నిలిచింది.
తిరువొత్తియూరు: శ్రీరంగంలో చైత్ర మాసం బ్రహ్మోత్సవాలు బుధవారం తెల్లవారుజామున ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యా యి. బుధవారం తెల్లవారుజామున ధ్వజస్తంభం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, ఉదయం 3:30 గంటలకు ధ్వజారోహణం చేశారు. ఉత్సవాల సందర్భంగా రోజూ ఉదయం, సాయంత్రం స్వామివారు వివిధ వాహనాల్లో పురవీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించనున్నారు. ఉత్సవాల్లో ముఖ్యమైన రథోత్సవం మే 14వ తేదీ ఉదయం జరగనుంది. 25వ తేదీన సప్త వర్ణం ఉత్సవాలు, 26వ తేదీన తీర్థవారితో ఉత్సవాలు ముగుస్తాయని తెలిపారు.


