మింగిల్‌ టూ సింగిల్‌ | - | Sakshi
Sakshi News home page

మింగిల్‌ టూ సింగిల్‌

Mar 15 2026 5:11 AM | Updated on Mar 15 2026 5:11 AM

తమిళసినిమా: సమాజంలో విడాకుల సంస్కృతి పెరుగుతుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. యువతి యువకుల మధ్య పెళ్లి అనేది నూరేళ్ల పంట అనే నానుడి ఇప్పుడు చాలా మంది విషయంలో కొన్నేళ్ల మంటగా మారుతోంది. ఈ విషయంలో ఎవరినీ తప్పు పట్టలేం. కారణం ఎవరి మనోభావాలు వారివి. గోటితోపోయే విషయాన్ని గొడ్డలి వరకు తెచ్చుకో రాదన్న సంగతిని కొందరి ఆలోచనకు రాకపోవడం కూడా విడాకుల సంస్కృతి పెరగడానికి కారణంగా భావించవచ్చు. ఇదిచాలా మంది విషయంలో జరుగుతున్న తంతే అయినా సెలబ్రిటీల వ్యవహారం మాత్రం వేగంగా, ఇంకాస్త ఎక్కువగా వెలుగు చూస్తోందని చెప్పాలి. ఇదే విధంగా హన్సిక విడాకులు వ్యవహారం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. తరచూ వార్తల్లో ఉండే ఈ ముంబై బ్యూటీ మ వ్యవహారం కథలు చాలానే వార్తల్లో హల్‌చల్‌ చేశాయి. శింబుతో ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు వెళ్లి ఆగి పోయింది. నాలుగు ఏళ్ల క్రితం సోహైల్‌ కతూరియ అనే ముంబైకి చెందిన వ్యాపారవేత్తను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆయనకిది రెండవ వివాహం అన్నది గమనార్హం. ఏదేమైనా వీరి వివాహ బంధం కొద్ది కాలం అన్యోన్యంగానే సాగింది. ఆ తరువాత నుంచే మనస్పర్థలు చిలికి చిలికి గాలీవాన అయినట్లు విడాకుల వరకు వెళ్లాయి. దీంతో వారిద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోవాలనే నిర్ణయానికి వచ్చి ముంబైలోని భందారా కుటుంబ సంక్షేమ కోర్టులో విడాకుల కోసం పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో న్యాయస్థానం ఇటీవల వీరికి విడాకులు మంజూరు చేసింది. ఇలా మింగిల్‌ అయిన హన్సిక నాలుగేళ్లలోనే మళ్లీ సింగిల్‌గా మారిపోయింది. భర్త నుంచి ఈ బ్యూటీ ఎలాంటి జీవన భరణం కోరలేదట. తాజాగా ఈ భామ తన ఇన్‌స్ట్రాగామ్‌లో జీవితంలో ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నా మనోధైర్యం సడలకుండా ఆనందంగా ముందుకు సాగండి. అంటూ పంజాబీ భాషలో ఒక ట్వీట్‌ చేశారు. ఆమె చేసిన ట్వీట్‌ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement