నేను అదృష్టవంతురాలిని
తమిళసినిమా: లక్కీలో ఉండే కిక్కే వేరు. అందుకు కాస్త ప్రతిభ తోడైతే ఫేమ్ తన్నుకుంటూ వస్తుంది. ప్రస్తుతం భాగ్యశ్రీ బోర్సే పరిస్థితి ఇదే. ఎక్కడో మహారాష్ట్ర నుంచి వచ్చిన ఈ అమ్మడు దక్షిణాది చిత్ర పరిశ్రమలో కథానాయకిగా క్రేజ్ తెచ్చుకుంటున్నారు. 25 ఏళ్ల పరువాల పడతి తన అందచందాలతో యువతను కట్టి పడేస్తున్నారు. మిస్టర్ బచ్చన్ చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సేకు ఆ చిత్రం హిట్ కాకపోయినా సినీ వర్గాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తరువాత విజయ్ దేవరకొండకు జంటగా నటించిన కింగ్‌డమ్ హిట్ అనిపించుకున్నా, ఆ చిత్రంలో ఈ అమ్మడి పాత్రకు పెద్దగా స్కోప్ లేదు. అయినప్పటికీ అవకాశాలు దక్కించుకుంటూనే ఉన్నారు. ఇకపోతే ఇటీవల దుల్కర్ సల్మాన్ సరసన నటించిన కాంత చిత్రం భాగ్యశ్రీ బోర్సే నటనాపరంగా మంచి ప్రశంసలు అందుకున్నారు. తాజాగా ఈమె తెలుగులో నటించిన మరో చిత్రం ఆంధ్రా కింగ్ తాలూకా చిత్రం ఈనెల 27న తెరపైకి రానుంది. ఇలాంటి పరిస్థితుల్లో భాగ్యశ్రీ బోర్సే అభిమాన సంఘం ఏర్పడుతున్నాయనట. దీని గురించి ఈ అమ్మడు పేర్కొంటూ తాను చాలా అదృష్టవంతురాలినని భావిస్తున్నానన్నారు. అభిమానుల ప్రేమ, అభిమానం అంత తొందరగా అందరికీ లభించవన్నారు. తనపై చూపుతున్న వారి ప్రేమాభిమానాలను ఎల్లప్పుడూ పొందుతానని నమ్ముతున్నట్లు చెప్పారు. ముందు ఈ అమ్మడు దక్షిణాదిలో ఏ మాత్రం నిలదొక్కుకుంటో చూద్దాం అంటున్నారు నెటిజన్లు.
భాగ్యశ్రీ బోర్సే


