మహత్ రాఘవేంద్రకు జోడీగా ఐశ్వర్య రాజేష్
తమిళసినిమా: మంగాత్త, జిల్లా, ఆన్బానవన్ అడంగాదవన్ అసరాదవన్ వంటి పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించిన నటుడు మహత్ రాఘవేంద్ర. కొన్ని చిత్రాల్లో కథానాయకుడిగానూ నటించారు. అయితే అవేవీ ఆశించిన విజయాలను సాధించలేదు. దీంతో చిన్నగ్యాప్ తీసుకున్న మహత్ రాఘవేంద్ర తాజాగా కొత్త లుక్ కు తయారయ్యారు. ఫుల్ వర్కౌట్స్‌తో ఆరు పలకల బాడీకి మారిన ఈయన మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ఇకపై తన సెకండ్ ఇన్నింగ్ చాలా వేగం పుంజుకుంటుందని అన్నారు. తాను తాజాగా పలు చిత్రాల్లో నటించడానికి సిద్ధమవుతున్నట్లు తెలిపారు. మహత్ రాఘవేంద్ర తాజాగా ఒక చిత్రంలో కథానాయకుడిగా నటించనున్నారని సమాచారం. ఈ చిత్రంలో ఆయనకు జంటగా ఐశ్వర్య రాజేష్ నటించనున్నట్లు తెలిసింది. ముఖ్యమైన పాత్రలో రమ్యకృష్ణ నటించనున్నట్లు సమాచారం. ఈచిత్ర షూటింగ్ డిసెంబర్ రెండో వారంలో ప్రారంభం కానుందని, ఇది తమిళం, తెలుగు భాషల్లో రూపొందనున్నట్లు తెలిసింది. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన పూర్తి వివరాలతో త్వరలో వెలువడే అవకాశం ఉంది. ఇకపోతే ఆ మధ్య తెలుగు చిత్ర పరిశ్రమకు ప్రాధాన్యతనిస్తూ వచ్చిన ఐశ్వర్యరాజేష్ చిన్న గ్యాప్ తర్వాత ఇప్పుడు మళ్లీ తమిళ చిత్రాఓ్ల నటించడానికి సిద్ధమవుతున్నారన్నది గమనార్హం.
మహత్ రాఘవేంద్ర, ఐశ్వర్య రాజేష్


