దేదీప్యమానం
విద్యుత్ దీపాలతో దగదగలాడుతున్న అరుణాచలేశ్వారాలయం
వేలూరు: ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయ కార్తీక బ్రహ్మోత్సవాలు ఈనెల 21మ దుర్గమ్మ ఉత్సవంతో ప్రారంభం కానుంది. ప్రతి సంవత్సరం కార్తీక బ్రహ్మోత్సవాలు పది రోజుల పాటూ నిర్వహించడం ఆనవాయితీ. ఉత్సవాల ఆఖరి రోజైన డిసెంబర్ 3న అరుణాచలేశ్వరాలయం ముందున్న మహా కొండపై మహా దీపాన్ని వెలిగిస్తారు. అందులో భాగంగా ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలు ఈనెల 24న ధ్వజా రోహణంతో ప్రారంభం కానున్నాయి. అందులో భాగంగా రెండు రోజుల ముందుగానే దుర్గమ్మ ఉత్సవంతో ఆలయ నిర్వహకులు పూజలను ప్రారంభించి ప్రత్యేక పూజలు చేపట్టనున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 30న ఉదయం 6.05 గంటలకు పంచ రథాలు బయలుదేరి అదే రోజు రాత్రికి చేరుకుంటుంది. ఆఖరి రోజైన డిసెంబర్ 3న ఉదయం 4 గంటలకు ఆలయం ఎదుట భరణి దీపం, సాయంత్రం 2,668 అడుగుల ఎత్తయిన మహాకొండపై మహా దీపాన్ని వెలిగించనున్నారు. ఇందుకోసం ఆలయ నిర్వాహకులు ఆలయంలోని స్వామి వారి వాహనాలను సిద్ధం చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. అదేవిధంగా స్వామి వారు మాడ వీధుల్లో వెళ్లే వివిధ వాహనాలకు మెరుగులు దిద్దే పనులను వేగవంతం చేస్తున్నారు.
సిద్ధమైన రాక్షస కొబ్బరి
అదేవిధంగా రథోత్సవానికి ఉపయోగించే సామాగ్రితో పాటూ మహా దీపం వెలిగించే మహా రాక్షస కొబ్బరిని శుభ్రం చేసి మెరుగులు దిద్ది సిద్ధంగా ఉంచారు. ఆలయాన్ని వివిధ పుష్పాలతో అలంకరించడంతో పాటు వివిధ రంగుల్లో అలంకరించారు. అదే విధంగా దీపోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయంలోని తొమ్మిది రాజ గోపురాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. అదే విధంగా ఆలయం చుట్టూ విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయడంతో అరుణాచలేశ్వరాలయం విద్యుత్ కాంతులతో దగదగ లాడుతోంది. తుంది. ఇదిలా ఉండగా ఉత్సవాల్లో భాగంగా 63 నాయనార్లను వాహనాల్లో ఉంచి మాడ వీధుల్లో ఊరేగించనున్నారు. ఇందుకోసం నాయన్‌మార్లు ఉత్సవాలకు మెరుగులు దిద్ది సిద్దంగా ఉంచారు. ఆలయ జాయింట్ కమిషనర్ భరణీధరన్ ఆధ్వర్యంలో సిబ్బంది పనులను వేగవంతం చేస్తున్నారు.
బ్రహ్మో త్సవాల్లో భాగంగా పది రోజుల పాటు స్వామి వార్లు వివిధ వాహనాల్లో మాడ వీధుల్లో భక్తులకు వివిధ అలంకరణల మధ్య దర్శనం ఇవ్వనున్నారు. ఇప్పటికే మాడ వీదుల్లో రోడ్డు మరమ్మతు పనులను పూర్తి చేశారు. ఈ పనులను కలెక్టర్ తర్పగరాజ్‌తో పాటూ అధికారుల బృందం పరిశీలించి ఆక్రమణలు లేకుండా చూడాలని ఆదేశించారు.
దేదీప్యమానం
దేదీప్యమానం


