డిసెంబర్ 25న సర్వం మాయ
తమిళసినిమా: మలయాళ నటుడు నివిన్ బాలి కథానాయకుడిగా నటించిన పలు చిత్రాలు తమిళంలోనూ మంచి విజయాన్ని సాధించాయి. ఈయన నయనతారతో కలిసి నటిస్తున్న డియర్ స్టూడెంట్స్ చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబ్ అవుతుంది. ఈయన తాజాగా నటించిన సర్వం మాయ చిత్రం క్రిస్మస్ పండుగ కానుకగా డిసెంబర్ 25న పాన్ ఇండియా స్థాయిలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన చిత్ర వర్గాలు గురువారం అధికారికంగా విడుదల చేశారు. దీనికి సంబంధించిన పోస్టర్లు కూడా విడుదల చేశారు.నితిన్‌బాలితోపాటు, అంజూ వర్గీస్, సీనియర్ నటుడు జనార్దన్ కలిసి ఉన్న ఈ పోస్టర్ ఇప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అఖిల్ సత్యన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఫయర్‌ఫై ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ నివిన్ బాలి మరోసారి ప్రేక్షకులను ఆలరించడానికి వస్తున్నారన్నారు. కుటుంబం నేపథ్యంలో సాగే వినోదభరిత కథా చిత్రంగా సర్వం మాయ ఉంటుందని చెప్పారు. ఇందులో ఆసక్తికరమైన అంశాలు చోటు చేసుకుంటాయన్నారు. కచ్చితంగా ఈ చిత్రం క్రిస్మస్ సెలవు రోజుల్లో ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని కలిగిస్తుందనే నమ్మకాన్ని దర్శకుడు వ్యక్తం చేశారు.


