అన్ని సంగీతాలకు మూలం డోలు సంగీతమే!
మాంబూమికు పరై చిత్ర ఆడియోను ఆవిష్కరించిన తోల్
తిరుమావళవన్‌తో ఇతర ప్రముఖులు, యూనిట్ సభ్యులు
తమిళసినిమా: డోలు వాయిద్య సంగీతం గురించి ఈ వేదికపై పలువురు సినీ ప్రముఖులు చాలా చక్కగా వివరించారు. ఈ సంగీతంతో మన తమిళ సంస్కృతికి ఎంత అనుబంధం ఉందన్నది ప్రతిఒక్కరూ చెప్పారు. అయితే డోలు సంగీతం అనేది ఇప్పుడు క్షీణ దశకు చేరుకుంది. అందుకే ఆ పదం ఇప్పుడు ఆ గౌరవంగా చూపబడుతోందనే పరిస్థితికి చేరుకుంది. ఆ పదం కారణంగా ఒక సామాజిక వర్గం క్షీణ దశకు చేరుకుందా, లేక ఒక సామాజిక వర్గం కారణంగా ఆ సంగీతం తగ్గించ బడిందా అన్నది అర్థం కావడం లేదు. అయితే డోలు సంగీతం అన్నది శివుడు మోగించినది అని గీత రచయిత స్నేహన్ రాసిన సాహిత్యానికి సంగీత దర్శకుడు దేవా సమకూర్చిన బాణీలు మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మాంబుమికు పరై (గౌరవప్రదమైన డోలు సంగీతం ) అని పేరును చిత్రానికి నిర్ణయించడం చాలా సహసోపేతమైన చర్య అభినందించదగినది. డోలు (పరై) ఒక సాధారణ పదం. అయితే ఇది అన్ని రకాల సంగీతానికి మూలం. అందులోనుంచే అన్ని రకాల సంగీతాలు రూపొందించబడ్డాయి అని వీసీకే పార్టీ అధ్యక్షుడు, ఎంపీ తోల్ తిరుమావళ్లవన్ పేర్కొన్నారు. సియా ప్రొడక్షన్‌న్స్ పతాకంపై శుభ సురేష్ రామ్ కలిసి నిర్మించిన చిత్రం మాంబూమికు పరై. ఈ చిత్రాన్ని నవ దర్శకుడు ఎస్.విజయ్ సుకుమార్ తెరకెక్కించారు. దేవా సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ద్వారా (ప్రముఖ చర్చా వేదిక+పట్టిమండ్రం) దిండిక్కల్ లియోని వారసుడు లియో శివకుమార్ కథానాయకుడుగా పరిచయం అవుతున్నారు. నటి గాయత్రి రెమ నాయకిగా నటించింది. ఈ చిత్రం డిసెంబర్ 10న విడుదలకు సిద్ధమవుతుంది ఈ సందర్భంగా చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించిన ట్రైలర్, ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో తోల్ తిరుమావళవన్ డోలు సంగీతం గురించి పై విధంగా మాట్లాడారు. దర్శకుడు కె.భాగ్యరాజ్, దిండుక్కల్ లియోని పాల్గొన్నారు.
అన్ని సంగీతాలకు మూలం డోలు సంగీతమే!


