ఆరోగ్యంలో అత్యున్నతంగా ఏసీజీ ప్రోగ్రామ్
సాక్షి, చైన్నె: వైద్య శాస్త్రం, పరిశోధన, శిక్షణ, నైపుణ్యం, ఆరోగ్య సంరక్షణలో ఉన్నత ప్రమాణాలు లక్ష్యంగా అడ్వాన్స్‌డ్ సర్టిఫికేషన్ ఇన్ జెనోమిక్స్(ఏసీజీ) ప్రోగ్రామ్‌కు శ్రీ రామచంద్ర ఇన్‌స్టిట్యూట్‌ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ శ్రీకారం చుట్టింది. అపోలా నాలెడ్జ్‌తో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంగ్లండ్ చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ ప్రొఫెసర్ డేమ్ సూ హిల్, నేషనల్ హెల్త్ సర్వీస్‌లోని ఇన్ క్లూజివ్ ఇంటిగ్రేటెడ్ కెరీర్స్ క్లీనికల్ లీడ్ ప్రొఫెసర్ గీతా మీనన్‌లు గురువారం శ్రీరామచంద్ర విద్యా సంస్థను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని ఇంగ్లాండ్‌లోని నేషనల్ హెల్త్ సర్వీస్ పాఠ్యాంశాలతో అనుసంధానించ బడినట్టు ప్రకటించారు. ఇది విద్యార్థులను గ్లోబల్ క్లినికల్ జెనోమిక్స్ శాస్త్ర వేత్తలుగా తీర్చిదిద్దేందుకు దోహదకరంగాఉంటుందని వివరించారు. ఏసీజీ జాతీయ, అంతర్జాతీయ నిపుణుల ద్వారా కేంద్రీకృత శిక్షణ, ఆంగ్ల భాష, సాప్ట్ స్కిల్స్, యూకే ఆధారిత ఆరోగ్యసంరక్షణ పాత్రలకు నిష్ణాతులుగా తీర్చిదిద్దుతుందని ప్రకటించారు.అపోలో నాలెడ్జ్ గ్లోబల్ వర్క్ ఫోర్సు డెవలప్‌మెంట్ చొరవలో ఇది అంతర్జాతీయ కెరీర్‌లకు ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ భాగస్వామ్యం హీల్ బై ఇండియా దార్శనికతకు అనుగుణంగా ఉంటుందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఆ విద్యా సంస్థ వీసీ ఉమాశేఖర్, ప్రో వీసీ మహేశ్ వాకముడి, రిజిస్టార్ ఎస్ సెంథిల్‌కుమార్, ప్రొఫెసర్ సోలమన్, ప్రొఫెసర్ వెంకటాచలం, అపోలో నాలెడ్జ్ సీఈఓ శివరామకృష్ణన్ వెంకటేశ్వరన్, జీడబ్ల్యుడీ చీఫ్‌ఎగ్జిక్యూటీవ్ అన్షుమ్ సిన్హా తదితరులు పాల్గొన్నారు.


