
వైభవంగా ఆలయ మహా కుంభాభిషేకం
వేలూరు: వేలూరు తోటపాళ్యం సుందర వినాయకుడి ఆలయ వీధిలోని శ్రీ సుందర వినాయకుడి ఆలయ మహా కుంబాభిషేక వైభవం గురువారం ఉదయం అతి వైభవంగా జరిగింది. ముందుగా బుధవారం రాత్రి గోపూజ, గజ పూజ, యాగ శాల పూజ, కళశ పూజలు, పూర్ణా హుతి, తదితర పూజలు జరిగింది. ఉదయం 6 గంటలకు గణపతి పూజ, హోమం, యాగ శాల పూజలు జరిగింది. అనంతరం వివిధ పుణ్య నదుల నుంచి తీసుకొచ్చిన నీటిని శివాచార్యులు వేద మంత్రాల నడుమ ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. అనంతరం పుణ్య నదుల నుంచి తీసుకొచ్చిన కళశ నీటిని ఆలయ రాజ గోపురంపైకి తీసుకెళ్లి మహా కుంభాభిషేకం నిర్వహించారు. ఆ సమయంలో రాజ గోపురంపై నుంచి కింద ఉన్న భక్తులపై కలశ నీటిని చల్లారు. ఈ పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే నందకుమార్, మేయర్ సుజాత, డిప్యూటీ మేయర్ సునీల్‌కుమార్, కార్పొరేషన్ జోన్ చైర్మన్ వీనస్ నరేంద్రన్, కౌన్సిలర్ మురుగన్, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మధ్యాహ్నం భక్తులకు అన్నదానం చేశారు.