
తిరుత్తణి మార్కెట్ కిటకిట
తిరుత్తణి: వినాయక చవితి సందర్భంగా తిరుత్తణి మార్కెట్‌లో సందడి నెలకొంది. భారీ సంఖ్యలో వెలసిన పూజా సామగ్రి దుకాణాల వద్ద వస్తువులు కొనుగోలుకు ప్రజలు పోటెత్తడంతో మార్కెట్ కిటకిటలాడింది. ఆది భగవాన్‌గా ప్రసిద్ధి చెందిన గణపతిని మొదటగా పూజలు చేసిన తరువాతే ప్రతి శుభ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం పరిపాటి. వినాయక చవితితో పండుగలు సైతం ప్రారంభమవుతాయి. అంతటి కీర్తి చెందిన వినాయక చవితి బుధవారం సందర్భంగా ఇంట్లో బొజ్జ గణనాథుడిని ఉంచి పూజలు చేసి మొక్కుకోవడానికి ప్రతి ఒక్కరూ ఉత్సాహం చూపుతారు. అలాగే వీధుల్లో గణపయ్య విగ్రహాలు ఏర్పాటు చేసి, మూడు నుంచి ఐదు రోజులపాటు పూజలు అందుకునే గణనాథుడు నిమజ్జనానికి బయల్దేరుతారు. అంతటి ప్రసిద్ధి చెందిన వినాయక చవితి సందర్భంగా తిరుత్తణి మార్కెట్‌లో వందలాది పూజా సామగ్రి దుకాణాలు వెలసి వ్యాపారం నిర్వహించారు. వస్తువులు కొనుగోలుకు తిరుత్తణి పట్టణంతోపాటు పరిసర ప్రాంతాలకు చెందిన గ్రామస్తులు మార్కెట్‌లో పోటెత్తారు. దీంతో సాయంత్రం 5 గంటల సమయంలో మార్కెట్ నిండింది. బంక మట్టి వినాయకుడు, పండ్లు, వినాయకుడి గొడుగులు, పువ్వులు, బొరుగులు, అరటి గెలలు, కొబ్బరి కాయలు, గుమ్మడికాయలు సహా పూజా సామగ్రి వ్యాపారం జోరుగా సాగింది. ధరలు పెరిగిన కొనుగోలుకు ప్రజలు ఆసక్తి చూపారు. బుధవారం చవితి సందర్భంగా వినాయకుడి ఆలయాలు ముస్తాబు చేశారు.
వినాయక చవితి వేడుకలు
తిరువళ్లూరు: వినాయకచవితి వేడుకలను పురస్కరించుకుని పూజాసామగ్రిని కొనుగోలు చేయడానికి భక్తులు పెద్ద ఎత్తున బజారువీధికి రావడంతో రద్దీగా మారింది. విగ్రహాలు రూ.50 నుంచి రూ. 25 వేల వరకు పలికింది.

తిరుత్తణి మార్కెట్ కిటకిట

తిరుత్తణి మార్కెట్ కిటకిట