క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Aug 22 2025 3:30 AM | Updated on Aug 22 2025 3:30 AM

క్లుప్తంగా

క్లుప్తంగా

పట్టాలపై బైక్‌ నడిపిన

ముగ్గురి అరెస్టు

అన్నానగర్‌: మధురై డివిజనల్‌ రైల్వేలోని మధురై–బోడి మార్గంలో, బోడి రైల్వే స్టేషన్‌ సమీపంలోని పట్టాలపై నలుగురు యువకులు ఇటీవల తమ మోటార్‌ సైకిళ్లపై సాహసయాత్ర చేశారు. ఆ సమయంలో ఆ ప్రాంతంలో ట్రాక్‌ నిర్వహణ విధుల్లో ఉన్న రైల్వే కార్మికులు వారిపై దాడి చేశారు. దీనితో ఆగ్రహించిన యువకులు రైల్వే కార్మికులపై దాడి చేసి అక్కడి నుంచి పారిపోయారు. ఈ విషయంలో, మధురై రైల్వే పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అంతేకాకుండా, యువకులను అరెస్టు చేయడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి, తీవ్ర పరిశోధన నిర్వహించారు. ఈ పరిస్థితుల్లో రైల్వే ట్రాక్‌ ప్రాంతంలో సాహసయాత్రలో పాల్గొన్న ముగ్గురిని పోలీసులు పట్టుకున్నారు. ఒక వ్యక్తి మాత్రమే పరారీలో ఉన్నాడు. అతని కోసం గాలింపు ముమ్మరం చేశారు. పట్టుబడిన వ్యక్తులను విచారించగా, వారు బోడి సుబ్బరాజ్‌ నగర్‌కు చెందిన గణేషన్‌ కుమారుడు ఈశ్వరన్‌, సుబ్బరాజ్‌ నగర్‌ పుదు కాలనీకి చెందిన రామకృష్ణన్‌ కుమారుడు మణికంఠన్‌, జయంనగర్‌కు చెందిన కంఠసామి కుమారుడు తంగపాండి అని తేలింది. దీంతో పోలీసులు ఆ ముగ్గురిని అరెస్టు చేశారు.

ఒకే కుటుంబానికి చెందిన

ముగ్గురికి జీవిత ఖైదు

కొరుక్కుపేట: కార్మికుడిని హత్య చేసిన కేసులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి నాగపట్నం కోర్టు జీవిత ఖైదు విధించింది. వివరాలు.. నాగపట్నం జిల్లా ముట్టం కీలాతేరుకు చెందిన నరసింగమూర్తి(60) కార్మికుడు. ఇతడికి అదే వీధికి చెందిన పరమశివం, మహదేవన్‌, భాగ్యవతి మధ్య శత్రుత్వం ఉంది. ఈక్రమంలో 2022లో రెండు కుటుంబాల మధ్య వివాదం తలెత్తింది, నరసింహమూర్తిని పరమశివం, అతని భార్య భాగ్యవతి, కుమారుడు మహాదేవన్‌ హత్య చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి పరమశివం, భాగ్యవతి, మహాదేవన్‌ను అరెస్టు చేశారు. ఈ విషయంలో నాగై జిల్లా న్యాయమూర్తి కోర్టులో జరిగిన ఈ కేసులో గురువారం సంచలన తీర్పు వెలువడింది. పరమశివం (55), భాగ్యవతి (52), మహాదేవన్‌ (31)కి న్యాయమూర్తి కందకుమార్‌ జీవిత ఖైదు విధించారు. దీని తరువాత, పరమశివం, మహాదేవన్‌ను కడలూరు జైలులో, భాగ్యవతిని తిరుచ్చి మహిళా జైలుకి తరలించారు.

ఎస్‌యూవీలో

కొత్త బెంచ్‌మార్క్‌

సాక్షి, చైన్నె: కొత్త బెంచ్‌ మార్కుతో డాల్బీ అట్మొస్‌ను కలిగిన ఎస్‌యూవీగా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ ఆర్‌ఈవీఎక్స్‌ ఏ అవతరించిందని మహీంద్రా అండ్‌ మహీంద్రా ఆటో మోటివ్‌ బిజినెస్‌ అధ్యక్షుడు ఆర్‌ వేలు స్వామి తెలిపారు. మహీంద్రాలో విస్తృత శ్రేణి అంశాలు, అధునాతన ఆవిష్కరణల గురించి గురువారం స్థానికంగా ఆయన ప్రకటించారు. డాల్బీ అట్మొస్‌ను మహీంద్రా వర్గానికి పరిచయం చేయడం ద్వారా మరింతగా కార్లలో ఆడియో వినోద అనుభవాన్ని విస్తృతం చేసినట్టు వివరించారు. ఇది కళాత్మక వ్యక్తికరణను పూర్తి సామర్థ్యంతో అందించే కొత్త మార్గంగా పేర్కొన్నారు. ఈ ఎస్‌యూవీ రూ. 12 లక్షల కంటే తక్కువ ధరకే లభించే డాల్బీ అట్మొస్‌గా పరిచయం చేశామన్నారు. ఇందులోని ప్రీమియం ఫీచర్లు ఎస్‌యూవీ కొనుగోలు దారుల కాంక్షలకు అనుగుణంగా ఉంటాయని వివరించారు. డాల్బీ లాబొరేటరీస్‌ సీనియర్‌ డైరెక్టర్‌ కరణ్‌ గ్రోవర్‌ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరికీ ప్రతి చోటా గొప్ప ధ్వనీ అందుబాటులో ఉంచాలన్న ధృక్పథంతో వినోదాన్ని పంచే కారుగా తీర్చిదిద్దామన్నారు.

స్కాన్‌ సెంటర్‌ పేరుతో

అబార్షన్లు

– డాక్టర్‌, బ్రోకర్లు అరెస్ట్‌

వేలూరు: తిరుపత్తూరులో స్కాన్‌ సెంటర్‌ నడుపుతూ ఆడపిల్లలను హత్య చేస్తున్న డాక్టర్‌తో పాటూ బ్రోకర్లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. గత కొద్ది రోజుల క్రితం ధర్మపురి, కృష్ణగిరి జిల్లాల నుంచి గర్భవతులను ఆటోలో తిరుపత్తూరు జిల్లా గ్రామానికి వచ్చారు. అయితే వచ్చిన వారికి స్కాన్‌ సెంటర్‌ ఉన్న దారి తెలియకపోవడంతో గ్రామ సమీపంలో ఆటోను నిలిపివేసి అడ్రస్సును స్థానికుల వద్ద అడిగినట్లు తెలుస్తుంది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వారి వద్దకు చేరుకుని విచారణ జరిపారు. ఆ సమయంలో ఏజెంట్ల మాటలు విని తాము వచ్చినట్లు తెలిపారు. దీంతో పోలీసులు ఏజెంట్లను అదుపులోకి తీసుకొని విచారణ జరపగా గ్రామీణ ప్రాంతాల్లో ఎవరు లేని ఇంటిని అద్దెకి తీసుకొని స్కాన్‌ సెంటర్‌ నడుపుతూ కడుపులో ఉన్న బిడ్డ ఆడ, మగ అని నిర్ధారించి అబార్షన్లు చేస్తున్నట్లు తెలిసంది. ఏజెంట్లు ఇచ్చిన సమాచారం వరకు రాచమంగళం గ్రామానికి చెందిన శివశక్తి అతని భార్య జ్యోతితో పాటూ కావేరి పట్నం చెందిన గోవిందం వ్యాపంబట్టు చెందిన రంజితం అమల ఏజెంట్లు అని తెలియ వచ్చింది. దీంతో ఏజెంట్లను పోలీసుల అరెస్టు చేసి పరారీలో ఉన్న డాక్టర్‌ సుకుమార్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసి విచారణ చేస్తున్నారు. ఏజెంట్ల సాయంతో డాక్టర్‌ స్కాన్‌ సెంటర్‌ నడుపుతున్నట్లు పోలీసులు నిర్ధారించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement