
క్రీడలతో ఉజ్వల భవిష్యత్
కొరుక్కుపేట: విద్యతోపాటూ క్రీడల్లోనూ ఆసక్తిని పెంచుకొని సాధన చేస్తే భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని బిలియడ్స్ అండ్ స్నూకర్ ప్రొఫెషనల్ అనలిస్ట్, పాన్ ఇండియా కోచ్ విజయకుమార్ అన్నారు. ఎస్‌కేపీడీ అండ్ చారిటీస్ నిర్వహణలో కొనసాగుతున్న ఎస్‌కేపీడీ బాలుర పాఠశాల, కేటీసిటీ బాలికల పాఠశాలల 2025 –26 క్రీడ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. స్థానిక జార్జిటౌన్‌లోని ఎస్‌కేపీసీ మైదానం వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిలియడ్స్ అండ్ స్నూకర్ ప్రొఫెషనల్ అనలిస్ట్, పాన్ ఇండియా కోచ్ విజయకుమార్, గౌరవ అతిథిగా లైఫ్ బోట్ ఫౌండేషన్ ట్రస్ట్ ట్రస్టీ అయ్యప్పన్ పాల్గొని జ్యోతి వెలిగించి క్రీడా దినోత్సవాన్ని ప్రారంభించారు . క్రీడల్లో రాణిస్తున్న విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు .అలాగే ఉపాధ్యాయులకు కూడా పోటీలను నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిని పాఠశాల కరచాలకులు ఎస్‌ఎల్ సుదర్శనం, కళాశాల కరచాలకులు ఊటు కూరు శరత్ కుమార్ ఘనంగా సత్కరించారు. విద్యార్థులను ఉద్దేశించి ముఖ్య అతిథి విజయ కు మార్ ప్రసంగించారు. పాఠశాలలో అనేకమంది జోనల్, డిస్ట్రిక్ట్ లెవెల్ రాణిస్తున్న విద్యార్థులందరికీ మెడల్స్‌ను ప్రదానం చేశారు. అథ్లెట్‌లో రాణి స్తున్న బి.చంద్రలేఖ, టెన్నికాయిట్‌లో రాణిస్తున్న సీహెచ్ హన్సికను, కేటీసిటీ పాఠశాల స్పోర్ట్స్ సెక్ర టరీ వి. దేవీని అతిథులు ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో రెండు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అనిల, లీలారాణి, రమేష్, రేవతి పాల్గొన్నారు.