
విద్యార్థులు పరిశోధనా విద్యకు ప్రాధాన్యమివ్వాలి
వేలూరు: ఇంజినీరింగ్ విద్యార్థులు పరిశోధన విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సినీ నటి రోహిని అన్నారు. సమీపంలోని అనై మీరా ఇంజినీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థులకు స్వాగత కార్యక్రమం కళాశాల చైర్మన్ రామదాసు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో సినీనటి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రస్తుతం కళాశాలల చేరిన విద్యార్థులు అధికంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులే కావడంతో మీ తల్లిదండ్రుల కష్టాలను ఒక్కసారి దృష్టిలో ఉంచుకొని ఉన్నత విద్యను అభ్యసించి మీ గ్రామానికి దేశానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు. పట్టుదలతో ప్రయత్నం చేస్తే జీవితంలో సాధించలేనిది ఏమీ లేదన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించింది పరిశోధనలపై ఆసక్తి చూపాలన్నారు. ఆర్కాడ్ ఎమ్మెల్యే ఈశ్వరప్ప మాట్లాడుతూ డీఎంకే ప్రభుత్వంలో ఉన్నత విద్యకు అధిక ప్రాధాన్య తీర్చి అవసరమైన సౌకర్యాలు కల్పిస్తుందని వీటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని మేధాశక్తితో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి దామోదరం, కళాశాల డైరెక్టర్ ప్రశాంత్ కిషోర్, కుమార్, ప్రిన్సిపల్ గోపీనాథ్, విద్యార్థిని విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.