
సీపీ రాధాకృష్ణన్‌ను మద్దతివ్వాలి
వేలూరు: ఎన్డీయే కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేయనున్న సీపీ రాధాకృష్ణన్‌కు తమిళ ఎంపీలందరూ మద్దతు ఇవ్వాలని రాష్ట్ర ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి ఎడపాడి పయణిస్వామి అన్నారు. ప్రజలను కాపాడుదాం, తమిళనాడును రక్షిందాం అనే సిద్దాంతంతో ఎడపాడి పళణిస్వామి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగా తిరువణ్ణామలై చేరుకున్న ఆయన సోమవారం ఉదయం అమ్మనియమ్మన్ గోపురం దారిలో సంపద వినాయకుడి సన్నిధి, అన్నామలైయార్ సన్నిధి, ఉన్నామలై అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ నిర్వహకులు పూర్ణకుంభ స్వాగతం పలికి ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ఆసమయంలో ఆలయంలోని శివాచార్యులతో కలిసి గ్రూప్ ఫొటో తీసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మహారాష్ట్ర రాష్ట్ర గవర్నర్‌గా ఉన్న తమిళనాడుకు చెందిన సీపీ రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారన్నారు. మొట్ట మొదటి సారిగా తమిళనాడుకు చెందిన వారికి ఉపరాష్ట్రపతి పదవి రావడం సంతోషంగా ఉందని ఆయనకు పార్టీలకు అతితంగా ఒక తమిళుడునే అభిమానంతో మద్దతు ఇవ్వాలన్నారు. అనంతరం రానున్న ఎన్నికల్లో కూటమి, రాజకీయ ప్రశ్నలకు ఆయన ఎటువంటి సమాదానం చెప్పకుండా కారులో గిరివలయం వెల్లారు. ఆయనతో పాటు మాజీ మంత్రి అగ్ని క్రిష్ణమూర్తితో పాటు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అన్నాడీఎంకే ప్రతినిధులు పాల్గొన్నారు.