
సిలికాన్ ఫోటోనిక్స్ జనరేటర్‌కు ఐఐటీ ఒప్పందాలు
సాక్షి, చైన్నె: భారతదేశపు మొట్టమొదటి సిలికాన్ ఫోటోనిక్స్ ఆధారిత హై–స్పీడ్ క్వాంటం రాండమ్ నంబర్ జనరేటర్ (క్యూఆర్‌ఎన్‌జీ) కోసం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ – మద్రాస్ రూ. కోటి విలువైన ఒప్పందంతో దేశీయంగా పరిశ్రమకు అనుమతి ఇచ్చింది. సిలికాన్ ఫోటోనిక్ క్యూర్‌ఎన్‌జీ వాణిజ్య విస్తరణ కోసం ఇంద్రార్కా క్వాంటం టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌తో రూ. కోటి లైసెన్సింగ్ ఒప్పందంపై టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ ఆఫీస్, ఐఐటీ మద్రాస్ సోమవారం సంతకాలు చేశాయి. ఐఐటీ మద్రాసులని సెంటర్‌ఫర్ ప్రోగ్రామబుల్ ఫోటోనిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అండ్ సిస్టమ్స్ (అభివృద్ధి చేయబడిన ఈ మైలురాయి, ఈ సాంకేతికత వ్యూహాత్మక విలువను, భారతదేశ క్వాంటం ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయడంలో తన సామర్థాన్ని చాటనుంది. ఈ అవగాహన ఒప్పందంపై సంతకం చేసే కార్యక్రమానికి ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి. కామకోటి అధ్యక్షత వహించారు. ఈ ఒప్పందంపై ఐఐటీ మద్రాస్ డీన్ (ఐసీఎస్‌ఆర్) ప్రొఫెసర్ మను శాంతనం, ఇంద్రార్కా క్వాంటం టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దీనానాథ్ సోని, ఇంద్రార్కా క్వాంటం టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ తేజ్ సోని, ఐఐటీ మద్రాస్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగం ప్రొఫెసర్ బిజోయ్ కృష్ణ దాస్ సంతకం చేశారు. కార్యక్రమానికి భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ శాస్త్రవేత్త డాక్టర్ శంఖదీప్ దాస్, డాక్టర్ వి. నటరాజన్ నితిన్, ఐఐటీ మద్రాసు అరనబ్ గో స్వామి ట్రాన్స్ ఫర్ ఆఫీస్ హెడ్ డాక్టర్ దారా అజయ్ హాజరయ్యారు.