
నాకు ఆ చెడ్డ అలవాటు ఉంది
తమిళసినిమా: సినీ సెలబ్రిటీలది లగ్జరీ లైఫ్ అని చెప్పక తప్పదు. షూటింగ్స్ లేని సమయాల్లో క్లబ్‌లు, పబ్బుల్లో గడపడం సర్వసాధారణమనే చెప్పాలి. అందరూ అని కాదు కానీ, చాలా మంది జీవన విధానం ఇలానే ఉంటుందంటారు. కొందరు తారలు మాత్రం తమ అలవాట్లను ధైర్యంగా బయటకు వెల్లడిస్తారు. మరి కొందరు కెరీర్ ఎక్కడ డ్యామేజ్ అవుతుందోనని భయపడతారు. అయితే నటి సంయుక్త మాత్రం మొదటి కోవకు వస్తారనే చెప్పాలి. 2016లో కథానాయకిగా రంగప్రవేశం చేసిన ఈ మలయాళీ కుట్టి మొదట్లో మాతృభాషలో నటించింది. ఆ తరువాత తెలుగు, కన్నడం, తమిళం, హిందీ భాషల్లో కూడా నటించి పాన్ ఇండియా కథానాయకిగా గుర్తింపు పొందారు. తెలుగులోనే వరుసగా అవకాశాలు పొందుతూ బిజీగా ఉన్న సంయుక్త తమిళంలో కలరి చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత జూలై కాట్రిల్ అనే చిత్రంలో నటించారు. అవేవీ ఈ అమ్మడికి గుర్తింపు తెచ్చిపెట్టలేదు. ఆ మధ్య ధనుష్‌తో జత కట్టిన వాత్తీ చిత్రం మంచి పేరు తెచ్చి పెట్టింది. ప్రస్తుతం తమిళంలో బెంజ్ అనే చిత్రంలో నటిస్తున్న సంయుక్త ఇటీవల ఒక సమావేశంలో చెప్పిన విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అంతగా వైరల్ అవుతున్న ఆ విషయం ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా.. తనకు ఒక చెడ్డ అలవాటు ఉందన్నారు. అదే మద్యం సేవించడం అని చెప్పారు. అయితే నిత్యం సేవించనని, మానసిక ఒత్తిడి, ఏదైనా ఆందోళన కలిగించే సంఘటన జరిగినప్పుడు మద్యం సేవిస్తానని చెప్పారు. ఇది సమాజంలోకి ఎలాంటి సందేశాన్ని తీసుకెళుతుందన్నది పక్కన పెడితే ఇలా తన చెడు అలవాటును బహిరంగపరచడానికి కూడా గట్స్ కావాలంటున్నారు నెటిజన్లు.
నటుడు సూర్య, దర్శకుడు జీతూ మాధవన్