
వేళచ్చేరిలో వృద్ధులకోసం గెరికేర్ సెంటర్
సాక్షి, చైన్నె: చైన్నె వేళ చ్చేరిలో గెరి కేర్ డయాలసిస్ డే కేర్ సెంటర్ ఏర్పాటు చేశారు. వృద్ధుల కోసం అత్యాధునిక సౌకర్యాలతో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. సోమవారం ఈ సెంటర్‌ను సినీ నటి సుహాసిని ప్రారంభించారు. 2018 నుంచి గెరికేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. తాజాగా 10వ సెంటర్‌గా వేళచ్చేరి ఎల్డర్‌కేర్‌ను దృష్టిలో ఉంచుకుని, 75 పడకలతో అత్యాధునిక అసిస్టెడ్ లివింగ్ సౌకర్యం, శస్త్రచికిత్స తర్వాత కోలుకోవడం, దీర్ఘకాలిక పరిస్థితి నిర్వహణ, వైకల్యం సంరక్షణ , ఆసుపత్రిలో చేరిన తర్వాత కావాల్సిన సహకారం, నిపుణుల వైద్య సంరక్షణ అవసరమయ్యే విధంగా వృద్ధుల కోసం అన్ని రకాల సౌకర్యాలను ఇక్కడ కల్పించారు. గెరి కేర్ నేతృత్వంలో డయాలసిస్ డే–కేర్ సెంటర్ ఫర్ ఎల్డర్స్‌గా ఈ సెంటర్‌పనిచేయనున్నది. ఈ సెంటర్‌కు సమీపంలోని ఫిజియోథెరపీ, పునరావాసం కోసం ప్రత్యేకమైన ఎల్డర్ ఫిట్‌నెస్ స్టూడియోతో పాటూ విశ్రాంతి తీసుకునేందుకు, పునరుజ్జీవనాన్ని ప్రోత్సహించేందుకు ఎల్డర్ గ్రోవ్ స్థలాలను కూడాఏర్పాటు చేశారు. ఈ సెంటర్‌ను సుహాసిని మణిరత్నం ప్రారంభించారు. ఇక్కడి సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా గెరి కేర్ హెల్త్ సర్వీసెస్ వ్యవస్థాపకుడు డాక్టర్ లక్ష్మీపతి రమేష్ మాట్లాడుతూ, అత్యాధునిక అసిస్టెడ్ లివింగ్ సౌకర్యం తో ఈ సెంటర్ ప్రారంభించామన్నారు. 2050 నాటికి పెరగనున్న వృద్ధుల సంఖ్యను పరిగణించి వారికి కావాల్సిన సేవలను అందించే విధంగా ముందుకెళ్తున్నామన్నారు. సుహాసిని మణిరత్నం మాట్లాడుతూ ఎల్డర్‌కేర్ తన హృదయానికి దగ్గరగా ఉన్న ఒక విషయం అని పేర్కొన్నారు. గెరి కేర్ ఆరోగ్య సంరక్షణలో నిజమైన కరుణ ఎలా ఉంటుందో చూపిస్తుందన్నారు. ఈ సదుపాయం కేవలం వైద్య సహాయం గురించి కాదు అని, ఇది గౌరవం, సౌకర్యం పెద్దలకు వారు అర్హులైన జీవన నాణ్యతను అందించడం కీలకంగా పేర్కొన్నారు., పద్మశ్రీ ప్రొఫెసర్ డాక్టర్ వి.ఎస్. నటరాజన్ మాట్లాడుతూ, దేశంలో వృద్ధాప్య సంరక్షణ చాలా అవసరం అని, ఇలాంటిసెంటర్లు ఇందుకు ఎంతో దోహదకరంగా వివరించారు.