పంట విక్రయించేలా చూడాలి
వేలూరు: వేలూరు జిల్లా పల్లిగొండ, ఒడుగత్తూరు ప్రాంతాల్లో రూ.65.08 కోట్లతో అమృత పథకం కింద నిర్మించిన వారపు సంతల్లో రైతులు పండించిన పంటను విక్రయించేందుకు అవకాశం కల్పించాలని డీఆర్‌ఓ మాలతి అన్నారు. నిర్మాణ కట్టడాలను సీఎం స్టాలిన్ చైన్నె సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. దీంతో పల్లిగొండలో డీఆర్వో మాలతి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. డీఆర్‌ఓ మాట్లాడుతూ వారపుసంతలను తమ ప్రాంతంలోని రైతులు వారి పొలాల్లో పండించిన పంటలను విక్రయించేందుకు వీలుగా సంతల కట్టడాలను ప్రభుత్వం నిర్మిస్తుందన్నారు. వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. జెడ్పీ చైర్మన్ బాబు, తహసీల్దార్ వేండా, రీజనల్ ఇంజినీర్ హంస, పల్లిగొండ మేజర్ పంచాయతీ కార్యదర్శి ఉమారాణి, సర్పంచ్ సుప్రియ పాల్గొన్నారు.


