అభివృద్ధి పనుల వేగవంతం
వేలూరు: జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి పూర్తిచేయాలని కలెక్టర్ సుబ్బలక్ష్మి అధికారులను ఆదేశించారు. మీ కోసం– మీ గ్రామంలో ఒక్కరోజు పథకం కింద వేలూరు జిల్లా కేవీ కుప్పం తాలుకా ప్రాంతంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను ఆమె తనిఖీ చేశారు. అనంతరం సోయంవూరు గ్రామంలో రూ.29 లక్షలతో నిర్మిస్తున్న గ్రామ పంచాయతీ కార్యాలయ నిర్మాణ పనులను తనఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అభివృద్ధి పనులతో పాటు నిర్మాణ పనులు నత్తనడకన జరుగుతున్నాయని అటువంటి కాంట్రాక్టర్‌లను రప్పించి పనులను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రానున్న వర్షాకాలంలోపు పనులను పూర్తి చేయాలన్నారు. అనంతరం కేవీ కుప్పం తాలుకా కేంద్రంలో ప్రజల నుంచి వినతి పత్రాలను స్పీకరించారు. అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులకు ఉదయం అందజేస్తున్న ఆహార వంటకాలను రుచి చూశారు. జిల్లా పంచాయతీ అధికారి తిరుమాల్, తహసీల్దార్ మురళి పాల్గొన్నారు.


