మధుమేహంపై విస్తృత పరిశోధనలు అవసరం
వేలూరు: ప్రపంచ వ్యాప్తంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు పెరుగుతున్నారని, ఈ వ్యాధి విస్తృతి తగ్గించేందుకు పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని వేలూరు వీఐటీ యూనివర్సిటీ చాన్సలర్ విశ్వనాధన్ పిలుపునిచ్చారు. వేలూరు జిల్లా కాట్పాడి ప్రాంతంలోని గాంధీనగర్‌లో డాక్టర్ మోహన్స్ మధుమేహ ఆసుపత్రిని ప్రారంభించి ఆయన మాట్లాడారు. మధుమేహంతో సుమారు 25 శాతం మంది మన ఇండియాలో బాధ పడుతున్నారని, గతంలో కోటీశ్వరులకు మాత్రమే ఈ వ్యాధి వచ్చేదని, ఇప్పుడు చిన్నవయస్సులోనే దీని బారిన పడుతున్నారంటూ దీనికి కారణాలను విశ్లేషించారు. మధుమేహ వ్యాధి వైద్య నిపుణులు డాక్టర్ మోహన్స్ మాట్లాడుతూ, ఈ వ్యాధిపై పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణులకు సైతం అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.. ఈ వ్యాఽధిబారిన వారు మితాహారం తీసుకోవాలని, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అలవరచుకోవాలన్నారు. తమ ఆస్పత్రిలో నిరుపేద మధుమేహ రోగులకు ఇన్సులిన్, మందులను ఉచితంగా ఇస్తున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నందకుమార్, కార్తికేయన్, వైద్య నిపుణులు డాక్టర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
మదుమేహ వ్యాధి గ్రస్తులు తగ్గేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయాలి


