ముగిసిన అంతర్జాతీయ నృత్య దినోత్సవాలు
చంద్రగిరి: అంతర్జాతీయ నృత్య దినోత్సవం సందర్భంగా బుధవారం తిరుచానూరు సమీపంలోని శిల్పారామంలో నిర్వహించిన నృత్య ప్రదర్శన ప్రత్యేకంగా ఆకట్టుకుంది. రెండు రోజుల పాటు శిల్పారామం సహకారంతో శ్రీకృష్ణ నటరాజాలయం వ్యవస్థాపకుడు కొండా రవి ఆధ్వర్యంలో దినోత్సవాలను నిర్వహించారు. ఇందులో భరతనాట్యం, కూచిపూడి, జానపద నృత్యాలను శిష్య బృందంతో కలసి ప్రదర్శించారు. 14 ఏళ్లలోపు చిన్నారులు చేసిన నాట్యం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. అనంతరం ఏఓ సుధాకర్ కళాకారులను సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు.


