విజయ్‌తో శివకార్తికేయన్
తమిళసినిమా: రెండు భారీ చిత్రాలు పొంగల్ బరిలో ఢీ కొనడానికి సిద్ధమవుతున్నాయి. అందులో ఒకటి నటుడు విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న జననాయకన్, నటి పూజా హెగ్డే నాయకిగా నటిస్తున్నారు. నటుడు ప్రకాష్ రాజ్, ప్రియమణి, దర్శకుడు గౌతమ్ మీనన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. కేవీఎన్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న చిత్రం ఇది.హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కారణం ఇది విజయ్ నటిస్తున్న చివరి చిత్రం కావడం కాగా జననాయకన్ సమకాలీన రాజకీయాలను ఆవిష్కరించే కథా చిత్రం కావడం మరో కారణం. ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. కాగా చిత్రాన్ని పొంగల్ సందర్భంగా విడుదల చేయనున్నట్లు నిర్మాతల వర్గం ఇటీవల అధికారికంగా ప్రకటించారు. కాగా దీనికి పోటీగా విడుదలకు సిద్ధమవుతున్న మరో క్రేజీ చిత్రం పరాశక్తి. శివకార్తికేయన్ కథానాయకుడిగా నటిస్తున్న ఇందులో నటుడు రవి మోహన్ ప్రతి నాయకుడిగా నటిస్తుండగా, అధర్వ ముఖ్య పాత్రను పోషిస్తున్నారు కాగా టాలీవుడ్ క్రష్ శ్రీలీల ఈ చిత్రం ద్వారా కోలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నారు. వైవిధ్య భరిత కథా చిత్రాల దర్శకురాలు సుధా కొంగర కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రాన్ని డాన్ పిక్చర్స్ పతాకంపై ఆకాష్ భాస్కరన్ నిర్మిస్తున్నారు. ఇది శివకార్తికేయన్ నటిస్తున్న 25వ చిత్రం కావడం విశేషం. ఇందులో ఆయన కళాశాల విద్యార్ధిగా నటిస్తున్నారు. ఇది పిరియాడిక్ కథతో రూపొందుతున్న చిత్రం కావడం గమనార్హం. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శ్రీలంకలో జరుగుతోంది. కాగా పరాశక్తి చిత్రాన్ని పొంగల్ సందర్భంగా విడుదల చేయనున్నట్లు నిర్మాత ఇప్పటికే ప్రకటించారు. దీంతో విజయ్, శివకార్తికేయన్ లో మధ్య పోటీ అనివార్య వుతోందని చెప్పవచ్చు. ఇందులో విషయం ఏమిటంటే ఈ రెండు చిత్రాలు తెలుగులోనూ విడుదల కానున్నాయి.
ఢీ


