కోటి రూపాయల ఆస్తి కాజేసి.. తల్లిని గెంటేసిన కన్నకొడుకు | - | Sakshi
Sakshi News home page

కోటి రూపాయల ఆస్తి కాజేసి.. తల్లిని గెంటేసిన కన్నకొడుకు

Sep 5 2023 1:46 AM | Updated on Sep 5 2023 10:48 AM

 వృద్ధురాలిని పరామర్శిస్తున్న కలెక్టర్‌  - Sakshi

వృద్ధురాలిని పరామర్శిస్తున్న కలెక్టర్‌

తిరువళ్లూరు: కోటి రూపాయల ఆస్తులను కాజేసి ఇంటి నుంచి గెంటేసిన కన్న కొడుకుపై చర్యలు తీసుకోవడంతో పాటు భూముల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని కోరుతూ వృద్ధురాలు కలెక్టర్‌ను వేడుకుంది. వివరాలు.. తిరువళ్లూరు పట్టణంలోని మాపోసి రోడ్డుకు చెందిన రవికుమార్‌. ఇతనికి భార్య మునియమ్మాల్‌(56)తో పాటు కొడుకు మహేష్‌బాబు కుమార్తెలు లోకేశ్వరి, దేవిక, విజయలక్ష్మి ఉన్నారు.

ఈ నేపథ్యంలో పది సంవత్సరాల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మునియమ్మాల్‌ తీవ్రంగా గాయపడి లేవలేని స్థితికి చేరింది. దీంతో పాటు 2012లో భర్త రవికుమార్‌ సైతం మృతి చెందాడు. దీనిని అదునుగా భావించిన మహేష్‌బాబు 2013లో తల్లి పేరుపై వున్న సుమారు రూ.కోటి విలువైన ఆస్తులను తన పేరుపై రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాడు. అనంతరం తల్లిని బయటకు గెంటేయడంతో కుమార్తెల వద్ద ఉంటోంది. ఈ నేపథ్యంలో తనకు జరిగిన అన్యాయంపై కలెక్టర్‌కు విన్నవించాలని కలెక్టరేట్‌కు వచ్చింది.

దీంతో వృద్ధురాలికి వద్దకు వచ్చి స్పృహతప్పి పడిపోయింది. దీంతో కలెక్టర్‌ ఆల్బీజాన్‌వర్గీష్‌ స్వయంగా వెళ్లి సమస్యను అడిగి తెలుసుకున్నారు. వెంటనే 108 ద్వారా వైద్యశాలకు తరలించారు. బాధితురాలికి న్యాయం చేస్తామని హమీ ఇచ్చారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement