1,300 కిలోల ఆఫ్రికన్‌ స్కార్పియన్‌ చేపలు స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

1,300 కిలోల ఆఫ్రికన్‌ స్కార్పియన్‌ చేపలు స్వాధీనం

Aug 24 2023 2:08 AM | Updated on Aug 24 2023 8:26 AM

- - Sakshi

అన్నానగర్‌: రామనాథపురంలో బుధవారం వేకువజామున 1,300 కిలోల అరుదైన ఆఫ్రికన్‌ స్కార్పియన్‌ చేపలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. రామనాథపురం ఫుడ్‌సేప్టీ ఆఫీసర్‌ లింగవేల్‌ పట్టణం ఖాతన్‌ ప్రాంతంలో ట్రాలీ దుకాణాలు, రోడ్డు పక్కన ఉన్న అంగళ్లపై బుధవారం వేకువజామున దాడులు చేశారు. అనంతరం ఆ ప్రాంతంలో నిలిపివున్న కార్గో వాహనంలో సోదాలు చేశారు.

ఈ వాహనంలో మన ప్రభుత్వం నిషేధించిన స్కార్పియన్‌ చేపలను ఆఫ్రికా నుంచి పెద్ద మొత్తంలో తీసుకెళుతున్నట్లు గుర్తించారు. అనంతరం అధికారులు వాటిని స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement